Tuesday, October 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పార్టీ అభివృద్ధికి పాటుపడే వారికి ప్రాధాన్యత లభిస్తుంది 

పార్టీ అభివృద్ధికి పాటుపడే వారికి ప్రాధాన్యత లభిస్తుంది 

- Advertisement -

పైడాకుల అశోక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు 
నవతెలంగాణ – గోవిందరావుపేట 

గత పది సంవత్సరాల కాలంలో టిఆర్ఎస్ పాలనలో పార్టీ అభివృద్ధికి పాటుపడిన ప్రతి ఒక్క నాయకుడు డిసిసి అధ్యక్ష పదవికి అర్హులేనని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని పీఎస్ఆర్ ఫంక్షన్ హాలులో ములుగు డిసిసి అధ్యక్షుడు ఎన్నికల కోసం అధిష్టానం చేపట్టిన సంఘటన్ సృజన్ అభియాన్ తెలంగాణ కార్యక్రమం ప్రస్తుత ములుగు డిసిసి అధ్యక్షులు పైడాకుల అశోక్ అధ్యక్షతన జరిగింది. కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ అధ్యక్షత వహించిన అశోక్ మాట్లాడుతూ కష్టపడి పని చేసే వారిని పార్టీ గుర్తిస్తుందని అన్నారు. 

అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మరియు  ఏఐసీసీ అబ్జర్వర్ గా వచ్చిన జాన్సన్ అబ్రహం మాట్లాడుతూ అన్ని వర్గాల అభిప్రాయం సేకరణతో పారదర్శకంగా డీసీసీ అధ్యక్షుడి ఎన్నిక పారదర్శకంగా జరుగుతుందన్నారు. డీసీసీ అధ్యక్షుల ఎన్నికకు అధిష్టానం ప్రత్యేక కార్యాచరణ రూపొందించిందన్నారు.  పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో పార్టీ కోసం ఎంతో కష్టపడి పోరాటాలు చేసిన కార్యకర్తలు నాయకులకు కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యత ఇచ్చి బాధ్యతాయుతమైన పదవులు ఇస్తుందన్నారు. డీసీసీ అధ్యక్ష పదవికి ఆసక్తి గల అభ్యర్థుల నుండి దరఖాస్తులను స్వీకరించారు. డీసీసీ ఎంపిక పారదర్శకంగా ఉంటుందని ఎవరైనా డీసీసీ పోటీలో ఉండవచ్చని ఈ ప్రక్రియలో ఎలాంటి లాబియింగ్ ఉండదని స్పష్టం చేశారు.

అధిష్టానం నిర్ణయమే తుది నిర్ణయమని కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ,ఎస్టీ ,మైనార్టీ, ఓబీసీ, మహిళా అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేసే దిశగా కృషి చేస్తుందన్నారు.పార్టీ కోసం కష్టపడేవారిని గుర్తించడంతోపాటు సమర్ధులైన నాయకులను ఎంపిక చేస్తామన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులకు సంబంధించి అందరి అభిప్రాయాలను సేకరించడంతోపాటు అభ్యంతరాలను కూడా పరిశీలిస్తామన్నారు.

డిసిసి అధ్యక్ష పదవికి నామినేషన్ ఏఐసీసీ అబ్జర్వర్ జాన్సన్ అబ్రహాం కు అందించిన ప్రస్తుత జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ మరియు టిపిసిసి ప్రధాన కార్యదర్శి మల్లాడి రామ్ రెడ్డి,గొల్లపల్లి రాజేందర్ గౌడ్.ఇర్స వడ్ల వెంకన్న చిడం రామ్మోహన్ రావు. సూరపనేని నాగేశ్వర్ రావు లు నామినేషన్ వెయ్యడం జరిగింది అనంతరం మండల అధ్యక్షులు బ్లాక్ మరియు అనుబంధ సంఘాల అధ్యక్షులు జిల్లా సీనియర్ నాయకుల అభిప్రాయాలను తీసుకోవడం జరిగింది అనంతరం ఆయన మాట్లాడుతూ నాయకుల దగ్గర తీసుకున్న  అభిప్రాయాలను టీపీసీసీ కి పంపుతామని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో టిపిసిసి పరిశీలకులు సాగరికరావు.నాగేందర్ రెడ్డి తో పాటు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవి చందర్ ములుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి తో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -