- Advertisement -
ప్రదానం చేసిన ఆ శాఖ డీజీ సౌమ్యమిశ్రా
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
గణతంత్ర దినోత్సవాలను పురస్కరించుకుని జైళ్ల శాఖ డీఎస్పీ రామయ్యకు ప్రెసిడెంట్ మెరిటోరియర్స్ మెడల్‌ను ఆ శాఖ డీజీపీ డాక్టర్ సౌమ్య మిశ్రా సోమవారం ప్రదానం చేశారు. జైళ్ల శాఖలో ఖైదీల పరివర్తన కోసం రామయ్య చేస్తున్న కృషికి గానూ ఈ మెడల్‌ను కేంద్ర హోంశాఖ ప్రకటించింది. చంచల్‌గూడలోని శిఖా గ్రౌండ్‌లో జరిగిన రిపబ్లిక్‌డే ఉత్సవాల్లో రామయ్య ఈ మెడల్‌ను సౌమ్యమిశ్రా నుంచి అందుకున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ మెడల్ తనకు రావడం తన బాధ్యతలను మరింతగా పెంచిందని ఆయన చెప్పారు.
- Advertisement -



