Monday, October 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రయివేట్ కొనుగోళ్లు ఫుల్లు.. సర్కార్ కొనుగోళ్లు నిల్

ప్రయివేట్ కొనుగోళ్లు ఫుల్లు.. సర్కార్ కొనుగోళ్లు నిల్

- Advertisement -

మోసపోతున్న రైతన్న పట్టించుకోని అధికారులు
నవతెలంగాణ – మద్నూర్

సోయా పంట చేతికి వచ్చింది. ప్రయివేట్ పరంగా కొనుగోలు ఫుల్లుగా కొనసాగుతున్నాయి. సర్కారు కొనుగోలు నిల్ గా ఉండటం సోయా పంట రైతన్న పెద్ద మొత్తంలో మోసపోతున్నట్లు వ్యవసాయ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ మద్దతు ధర సర్కారు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో ప్రయివేటు వ్యాపారులు పల్లెటూర్లలో భారీగా కొనుగోలు జరుపుతున్నారు. మద్దతు ధర కంటే క్వింటాలుకు రూ.1000 నుండి రూ.1200 వరకు తక్కువ ధరతో కొనుగోలు జరుపుతున్నట్లు సోయా పంట రైతులు తెలిపారు. ఈ ఏడాది భారీ వర్షాలు మూలంగా వ్యవసాయ రైతులు పంట దిగుబడులు రాక దిగులు చెందుతుంటే మద్దతు ధర లభించక మోసపోవలసి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రయివేట్ కొనుగోళ్లపై ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడం దళారుల చేతుల్లో రైతన్న జేబులు కొల్లగొడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యం చెయ్యకుండా  సోయా పంట మద్దతు ధర కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించి, ప్రయివేటు దళారుల చేతుల్లో మోసపోకుండా అరికట్టాలని సోయా పంట రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -