– అసోం కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ చైర్మెన్‌గా నియామకం
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనాయకురాలు, ఎంపీ ప్రియాంక గాంధీకి ఆ పార్టీ కీలక బాధ్యతలు అప్పగించింది. ఈ ఏడాది అసోంలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అక్కడ స్క్రీనింగ్ కమిటీ చైర్మెన్‌గా ఆమెను నియమించింది ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రియాంక కమిటీలో లోక్‌సభ ఎంపీలు ఇమ్రాన్ మసూద్, సప్తగిరి శంకర్ ఉలకతో పాటు సిరివెల్ల ప్రసాద్‌ను సభ్యులుగా నియమించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖరారు, ఎన్నికల ముందు జరగాల్సిన అంతర్గత సంప్రదింపులు వంటివి ఈ కమిటీ నిర్వహించనుంది. ఇక, పశ్చిమ బెంగాల్, కేరళ. తమిళనాడు పుదుచ్చేరిలకు కూడా స్క్రీనింగ్ కమిటీలను ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు.
ప్రియాంక గాంధీకి కీలక బాధ్యతలు..
- Advertisement -
- Advertisement -



