Wednesday, December 31, 2025
E-PAPER
Homeజాతీయంప్రియాంక గాంధీ కుమారుడి నిశ్చితార్థం ..!

ప్రియాంక గాంధీ కుమారుడి నిశ్చితార్థం ..!

- Advertisement -

న్యూఢిల్లీ : సీనియర్‌ కాంగ్రెస్‌ నేత, ఎంపీ ప్రియాంక గాంధీ, వ్యాపారవేత్త రాబర్ట్‌వాద్రాల కుమారుడు రేహాన్‌ వాద్రా నిశ్చితార్థం జరిగింది. తన చిరకాల మిత్రురాలు అవీవా బేగ్‌తో రేహాన్‌ నిశ్చితార్థం జరిగినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయ. రేహాన్‌ వాద్రా, అవీవా బేగ్‌ ఏడేళ్లుగా స్నేహితులుగా ఉన్నారు. ఇటీవల అవీవా బేగ్‌ ఎదుట రేహాన్‌ ఇటీవల ప్రేమ ప్రతిపాదన తీసుకురాగా ఆమె అంగీకరించినట్లు సమాచారం. ఇరువురి పెళ్లికి ఇరు కుటుంబాలు ఆమోదం తెలిపాయి. అవీవా బేగ్‌ కుటుంబం ఢిల్లీలో నివసిస్తోంది. ఇరుకుటుంబాలు సన్నిహితంగా ఉన్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఈ సమాచారంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది. పదేండ్ల నుంచి రేహాన్‌ వాద్ర విజువల్‌ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్నాడు. వైల్డ్‌లైఫ్‌, స్ట్రీట్‌, కమర్షియల్‌ ఫొటోగ్రఫీతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 2017లో స్కూల్‌ క్రికెట్‌మ్యాచ్‌లో కంటికి గాయమైన తర్వాత తన అనుభవాలను విజువల్‌గా రూపొందించారు. 2021లో ఢిల్లీలో బికరేన్‌ హౌస్‌లో డార్క్‌ పర్సెప్షన్‌ పేరుతో తన తొలి ఎగ్జిబిషన్‌ను నిర్వహించారు.

నా కంటికి జరిగిన ప్రమాదం తర్వాత నలుపు, తెలుపు రంగుల్లో చిత్రాలు వేయడం ప్రారంభించానని రేహాన్‌ వాద్రా తెలిపారు. ఒక వ్యక్తి వస్తువులను ఎలా గుర్తిస్తాడు, చీకటి నుంచి కాంతిని గుర్తించడానికి చేసే ప్రయత్నంపై ఆయన పలు చిత్రాలను గీసినట్టు తెలిపారు. అవీవా బేగ్‌ కూడా ఫొటోగ్రాఫర్‌, ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -