- Advertisement -
జిల్లా ఎస్పీని కలిసిన ప్రజాసంఘాల నాయకులు, పార్టీల ప్రతినిధులు
నవతెలంగాణ – గట్టు
జోగులాంబ గద్వాల జిల్లాలోని గట్టు మండలం చిన్నోనిపల్లి గ్రామంలో ప్రియాంక మరణం పైన అనేక అనుమానాలు ఉన్నయని, వాటి పైన దర్యాప్తు జరిపి నిందితులను వెంటనే రిమాండ్ చేయాలని ఎస్పీ శ్రీనివాసరావు కి సోమవారం వినతిపత్రం అందజేశారు.
అదేవిధంగా ప్రియాంక హత్యకు కారణమైనటువంటి వాళ్ళను వెంటనే రిమాండ్ చేసి ప్రియాంక ఆత్మ కి శాంతి చేకూరాలని అని ఎస్పీ కి విన్నవించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజాసంఘ నాయకులు పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
- Advertisement -