Wednesday, August 12, 2026
E-PAPER
Homeఖమ్మంగోదావరి ప్రతిభాపరీక్ష విజేతలకు బహుమతులు

గోదావరి ప్రతిభాపరీక్ష విజేతలకు బహుమతులు

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట
విద్యార్థుల్లో పోటీ తత్వాన్ని, నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రతిభా పరీక్షలు దోహదపడతాయని అశ్వారావుపేట కాంప్లెక్సు ప్రధానోపాధ్యాయురాలు హరిత అన్నారు. బుధవారం అశ్వారావుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు గోదావరి ప్రతిభాపరీక్షలో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.

రాజమహేంద్రవరానికి చెందిన ఎడ్యుకేషన్ స్పెషల్ పత్రిక సౌజన్యంతో ఏప్రిల్‌లో నిర్వహించిన తెలుగు గోదావరి ప్రతిభాపరీక్షలో అశ్వారావుపేట కాంప్లెక్సు పరిధిలోని వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. పరీక్షలో ప్రతిభ కనబరిచి ర్యాంకులు సాధించిన విద్యార్థులకు పతకాలు, బహుమతులు, ధ్రువీకరణ పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా హరిత మాట్లాడుతూ విద్యార్థుల్లో పోటీ తత్వాన్ని పెంపొందించడంతోపాటు వారి నైపుణ్యాలను వెలికితీయడానికి ఇలాంటి ప్రతిభా పరీక్షలు ఉపయోగపడతాయని తెలిపారు. విజేతలకు అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో కాంప్లెక్సు సీఆర్‌పీ సిద్ధాంతపు ప్రభాకరాచార్యులు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -