నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
శ్రీచైతన్య స్కూల్ రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ మీట్‌లో విజేతలకు ప్రముఖులు బహుమతులు అందజేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో వివిధ క్రీడాంశాల్లో గెలుపొందిన విద్యార్థులు బహుమతులు అందుకున్నారు. ఈ సందర్భంగా విజేతలను శ్రీచైతన్య విద్యాసంస్థల డైరెక్టర్ బొప్పన సీమా విజేతలను అభినందించారు. శ్రీచైతన్య విద్యాసంస్థల చైర్ పర్సన్ బొప్పన ఝాన్సీలక్ష్మి బాయి, మాదాపూర్ డీసీపీ రితిరాజ్, తెలంగాణ ఈగిల్ ఫోర్స్ ఎస్పీ సీతారాం, ఇండియన్ వాలీబాల్ టీం మాజీ కెప్టెన్ వెంకట నారాయణ, సినీ యాక్టర్ కిరణ్ అబ్బవరం, సినీ డైరెక్టర్ వి.ఎన్.ఆదిత్య, ప్రముఖ టీవీ యాక్టర్ రామ్ ప్రసాద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలోని 685 బ్రాంచీల్లో బ్రాంచ్ లెవల్ పోటీలు నిర్వహించగా 59,778 మంది పాల్గొన్నారు. ప్రతి బ్రాంచ్ నుంచి 138 మంది చొప్పున జోనల్ లెవల్ లెవల్‌లో 12,420 మంది పోటీ పడ్డారు. వారి నుంచి 630 మంది ఫైనల్ పోటీల్లో త్రోబాల్, ఖో-ఖో, 100 మీటర్ల పరుగు, షాట్ పుట్‌లలో నిర్వహించిన పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
శ్రీచైతన్య స్కూల్ రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ మీట్‌లో విజేతలకు బహుమతుల అందజేత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



