Friday, August 15, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్భూభారతి చట్టంతోనే సమస్యలు పరిస్కారం.!

భూభారతి చట్టంతోనే సమస్యలు పరిస్కారం.!

- Advertisement -

తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య
నవతెలంగాణ – మల్హర్ రావు
: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తిసుకొచ్చిన భూ భారతి 2025 చట్టంతో భూ సమస్యలు పరిష్కారం అవుతాయని తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య అన్నారు. మంగళవారం మండలంలోని పెద్దతూoడ్ల గ్రామంలో 215, తాడ్వాయిలో 40,మొత్తం 255 దరఖాస్తులు మండల తహసిల్దార్ రవికుమార్ అధ్యక్షతన నిర్వహించిన భూ భారతి రెవెన్యూ సదస్సులో వివిధ సమస్యలపై వచ్చిన దరఖాస్తులను స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యదితిగా హాజరై పిఏసిఎస్ చైర్మన్ మాట్లాడారు. గతంలో ఉన్న ధరణిలో అనేక లోపాలు ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం గుర్తించి ధరణి స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకువచ్చేందుకు మేధావులు, రైతు సంఘాలు, అందరితో చర్చించి గత చట్టంలోని లోపాలను సవరిస్తూ కొత్త చట్టం తీసుకు వచ్చిందన్నారు. లోపభూయిష్టంగా ఉన్న ధరణి వల్ల పట్టాల జారీలో ఏదేని పొరపాటు జరిగితే అప్పీలు చేయడానికి ఆవకాశం లేదని, రైతులు సివిల్ కోర్టు చుట్టూ తిరగాల్సి వచ్చేదని దానివల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ధరణి స్థానంలో భూ భారతి తెస్తామని చెప్పిన ప్రకారం పటిష్టమైన చట్టాన్ని అమల్లోకి తెచ్చినట్లు తెలిపారు. భూములు కొన్నా, అమ్మినా లైసెన్స్డ్ సర్వేయర్ ద్వారా హద్దులతో మ్యాపు తయారు చేసి పట్టాదారు పాసు పుస్తకాల్లో నమోదు చేస్తారని తద్వారా భూమి గుర్తింపుకు అవకాశం కలుగుతుందని తెలిపారు. ఏదేని సందర్భంలో తహసీల్దార్ ద్వారా పొరపాటు జరిగితే ఆర్డిఓ, ఆర్డిఓ నుండి కలెక్టర్, కలెక్టర్ నుండి భూ ట్రిబ్యునల్ కు వెళ్ళడానికి అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఉచిత న్యాయ సహాయ సేవలు అందించడానికి అవకాశం కల్పించారని అన్నారు.ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad