Monday, December 15, 2025
E-PAPER
Homeజిల్లాలుకార్మిక, కర్షక, ఐక్య పోరాటాలతోనే సమస్యల పరిష్కారం 

కార్మిక, కర్షక, ఐక్య పోరాటాలతోనే సమస్యల పరిష్కారం 

- Advertisement -

సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ – మిర్యాలగూడ 

కార్మిక, కర్షక, ఐక్య పోరాటాలతోనే సమస్యలు పరిష్కారం అవుతాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. అఖిలభారత సిఐటియు మహాసభల సందర్భంగా సోమవారం త్రిపురారం మండలంలోని పెద్దదేవులపల్లి లో ఉన్న రెడ్డీస్ ఫ్యాక్టరీ వద్ద సిఐటియు జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 31 నుండి వచ్చే నెల 4వ తేదీ వరకు విశాఖపట్నంలో  సిఐటియు జాతీయ మహాసభలు జరుగుతున్నాయని తెలిపారు. జనవరి 19న దేశవ్యాప్తంగా కార్మిక కర్షక ఐక్య పోరాటాలు జరగనున్నట్లు తెలిపారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని ఆరోపించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కార్మికుల సంక్షేమాన్ని నిర్విరం చేసేందుకు కుట్ర చేస్తుందని ఆరోపించారు. ముఖ్యంగా కార్మికుల చట్టాలను రద్దుచేసి కొత్తగా నాలుగు లేబర్ కోడులను అమలు చేస్తుందని దానివల్ల కార్మికులకు తీరని అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులు తమ హక్కుల కోసం సంఘాలు పెట్టుకునే పరిస్థితి లేకుండా పోతుందని చెప్పారు. కార్మికులకు కనీస వేతనాలు అందకుండా పోతాయని వారితో వెట్టి చాకిరి చేయించుకుంటారని విమర్శించారు.

కొత్త చట్టాలను బిజెపి రాష్ట్రాలు అమలు చేస్తున్నారని తెలిపారు. ఆ చట్టాలను వ్యతిరేకంగా కేరళ ప్రభుత్వం తమ రాష్ట్రంలో అమలు చేయకుండా అడ్డుకుందని గుర్తు చేశారు. కొత్త చట్టాలు రద్దు అయ్యేంతవరకు కార్మికులు ఐక్య ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. అఖిల భారత సిఐటియు జాతీయ మహాసభలను కార్మికులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రెడ్డీస్ ఫ్యాక్టరీ యూనియన్ అధ్యక్షులు ఏ శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ సత్యనారాయణ ప్రసాదు రాములు నాగేందర్ జనార్దన్ సైదులు సిహెచ్ వెంకటేషులు రామాంజనేయులు లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -