Tuesday, June 10, 2025
E-PAPER
Homeసినిమా“సంజీవ్” పోస్టర్‌ను ఆవిష్కరించిన నిర్మాత-దర్శకులు మధుర శ్రీధర్

“సంజీవ్” పోస్టర్‌ను ఆవిష్కరించిన నిర్మాత-దర్శకులు మధుర శ్రీధర్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: స్వతంత్రంగా రూపొందుతున్న చిత్రం “సంజీవ్” యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఈ రోజు హైదరాబాద్‌లో ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత-దర్శకులు శ్రీ మధుర శ్రీధర్,తెలుగు చలన చిత్ర దర్శకుడు సంజీవ్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ చిత్రానికి అనిల్ నక్క దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో టీజర్, ట్రైలర్ , పాటలను మధుర ఆడియో ద్వారా విడుదల చేయనున్నారని దర్శకుడు అనిల్ నక్క తెలిపారు. రచయితగా , స్క్రీన్‌ప్లే రచయితగా కూడా ఆయన ఈ చిత్రానికి ప్రాణం పోశారు. ఈ చిత్ర కథ భావోద్వేగాలకు ప్రాధాన్యత ఇచ్చేలా ఉండేలా రూపొందించబడిందని యూనిట్ సభ్యులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ జాన్ కె జోసెఫ్, నటులు వీర మనోహర్, అచ్యుత్, హరీష్ పాలకుర్తి, శివ శంకర్ చింతకింది తదితరులు పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -