– విద్యా సంస్థల క్యాలెండరు ఆవిష్కరణ
– ఈ జ్యోతి ఎల్లప్పుడు వెలుగుతూనే ఉండాలి
– తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి
నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి జిల్లా కేంద్రంలో పలు విద్యాసంస్థల నిర్వాహకులు గురువేందర్ రెడ్డి శనివారం ఏర్పాటు చేసిన అయ్యప్ప మహా పడిపూజలో కామారెడ్డి జిల్లాలోని బిపేట మండలం జనగామ గ్రామానికి చెందిన ప్రముఖ బిల్డర్, విద్యాదాత, సంఘ సేవకులు తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి పాల్గొన్నారు. గురువేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతున్న వివేకానంద బి టాపర్స్ పాఠశాల, శ్రీ ఆర్యభట్ట జూనియర్ కళాశాల, పిజెఆర్ స్ఫూర్తి డిగ్రీ కళాశాల, మంజీరా డిగ్రీ, పీజీ కళాశాల, కౌటల్య ఎడ్యుకేషనల్ అకాడమీ, ఎస్ ఏ వి సి ఒకేషనల్ కళాశాల తదితర విద్యాసంస్థల క్యాలెండర్ లను ఈ సందర్భంగా ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుభాష్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులను ప్రతినిత్యం వారు ఉన్నత లక్ష్యాల వైపు అడుగు వేసేలా కృషి చేస్తున్న గురువేందర్ రెడ్డిని అభినందించారు.
ఈ విద్య జ్యోతి ఇలాగే కొనసాగుతూ కామారెడ్డి నుండి మరింత మంది విద్యార్థులను మేధావులుగా తయారు చేసి దేశానికి అందించాలన్నారు. అనంతరం అయ్యప్ప మాల ధారణ చేస్తూ 18 సంవత్సరాల పూర్తి చేసుకున్న గురువేందర్ రెడ్డి కి కంకణ ధారణ చేసి అయ్యప్ప స్వాములు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ ఆర్యభట్ట జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ హనుమంతరావు, మంజీరా డిగ్రీ పీజీ కళాశాల ప్రిన్సిపల్ సత్యనారాయణ, లెక్చరర్ గోపాల్ రెడ్డి, జనగామ గ్రామ సర్పంచి మట్ట శ్రీనివాస్, ఎస్సార్ ఫౌండేషన్ సభ్యులు బీబీపేట మాజీ వైస్ ఎంపీపీ కప్పెర రవీందర్ రెడ్డి, అశోక్ గౌడ్, చాట్ల బాబు, ఒడ్డే సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.



