Thursday, February 12, 2026
E-PAPER
Homeతాజా వార్తలుప్ర‌ముఖ‌ దూర‌ద‌ర్శ‌న్ యాంక‌ర్ క‌న్నుమూత‌

ప్ర‌ముఖ‌ దూర‌ద‌ర్శ‌న్ యాంక‌ర్ క‌న్నుమూత‌

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : దూర‌ద‌ర్శ‌న్‌లో వార్త‌లు చ‌దివిన ప్ర‌ముఖ యాంక‌ర్ స‌ర‌ళా మ‌హేశ్వ‌రి(71) క‌న్నుమూశారు. ఆ యాంక‌ర్ మృతి ప‌ట్ల దూర‌ద‌ర్శ‌న్ నివాళి అర్పించింది. స‌ర‌ళ‌మైన కంఠం, స్ప‌ష్ట‌మైన ఉచ్ఛార‌ణ‌తో హుందాగా ఆమె హిందీ వార్త‌లు చేదివేవారు. దూర‌ద‌ర్శ‌న్ ఫ్యామిలీ త‌ర‌పున స‌ర‌ళా మ‌హేశ్వ‌రి మృతి ప‌ట్ల నివాళి అర్పిస్తున్న‌ట్లు డీడీ త‌న ఎక్స్‌లో ట్వీట్ చేసింది. దూర‌ద‌ర్శ‌న్‌లో ఎంతో గౌర‌వ‌ప్ర‌ద‌మైన న్యూస్‌రీడ‌ర్‌గా ఆమెను గుర్తిస్తార‌ని, భార‌తీయ వార్తాప్ర‌పంచంలో ఆమెకు ప్ర‌త్యేక స్థానం ఉన్న‌ద‌ని, త‌న స్వ‌రం, ఉచ్ఛార‌ణ‌తో ఆక‌ట్టుకునేవార‌ని, చాలా సింపుల్‌గా ఆమె క‌నిపించేవార‌ని డీడీ త‌న ఎక్స్‌లో పేర్కొన్న‌ది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -