Saturday, February 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బేస్ట్ ఆవేలేబుల్ స్కూల్స్ పథకానికి ప్రతిపాదనలు ఆహ్వానం

బేస్ట్ ఆవేలేబుల్ స్కూల్స్ పథకానికి ప్రతిపాదనలు ఆహ్వానం

- Advertisement -

నవతెలంగాణ – కామారెడ్డ
కామారెడ్డి జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఆధ్వర్యంలో అమలు చేయబడుతున్న “టెస్ట్ ఆవేలేబుల్ స్కూల్స్” పథకం కింద 2026 – 27 విద్యా సంవత్సరానికి గాను ప్రయివేట్ ఆంగ్ల మాధ్యమ పాఠశాలల నుండి ప్రతిపాదనలు కోరుతున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి పి. వెంకటేష్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ గుర్తింపు పొందిన, మంచి పేరు ప్రఖ్యాతులు కలిగిన 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో బోధన అందిస్తున్న ప్రైవేట్ పాఠశాలలు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.

పథకం కింద 5వ తరగతి రెసిడెన్షియల్ విద్యార్థులకు రూ. 42,000 ఉపకార వేతనంతో పాటు ఉచిత హాస్టల్, భోజన వసతి, రెండు జతల దుస్తులు, పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, ట్యూషన్ ఫీజు చెల్లించబడును. 1వ తరగతి డే స్కాలర్ విద్యార్థులకు రూ. 28,000 ఉపకార వేతనంతో పాటు ట్యూషన్ ఫీజు, రెండు జతల దుస్తులు, పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు అందజేయబడును. అర్హతగా పాఠశాలలు మంచి మౌలిక వసతులు కలిగి ఉండాలి. గత 5 సంవత్సరాలలో 7వ, 10వ తరగతులలో కనీసం 90 శాతం ఉత్తీర్ణత ఉండాలి. అందులో కనీసం 50 శాతం విద్యార్థులు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులై ఉండాలి.

ఆసక్తి గల పాఠశాలలు తమ ప్రతిపాదనలను 23 – 03 – 2026 సాయంత్రం 5 గంటలలోపు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి కార్యాలయం, రూమ్ నెం.113, ఫస్ట్ ఫ్లోర్, సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (IDOC), కామారెడ్డి వద్ద సమర్పించాలని సూచించారు. దరఖాస్తుతో పాటు పాఠశాల అనుమతి పత్రం, బిల్డింగ్ ప్లాన్, అగ్ని మాపక భద్రత పత్రాలు, గత ఐదు సంవత్సరాల ఉత్తీర్ణత శాతం వివరాలు, నిర్వహిస్తున్న కోర్సుల వివరాలు, నివాస వసతి వివరాలు, ఉపాధ్యాయులు, సిబ్బంది వివరాలు సమర్పించవలసి ఉంటుంది. ఇతర వివరాలకు కార్యాలయ పని దినములలో సంప్రదించవచ్చని, 7093822162 నంబర్‌కు ఫోన్ చేయవచ్చని  తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రైవేట్ పాఠశాలలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి పి. వెంకటేష్ ఆ ప్రకటనలో కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -