Wednesday, February 11, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం642 కిలోమీటర్ల రోడ్ల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు

642 కిలోమీటర్ల రోడ్ల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ప్రధానమంత్రి గ్రామసడక్‌ యోజన నాలుగో దశలో భాగంగా రాష్ట్రంలో రోడ్‌ కనెక్టివిటి లేని 227 ఆవాసాల్లో 642 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిం చింది. ఈ మేరకు మంగళవారం హైదరా బాద్‌లోని సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు అధ్యక్షతన రాష్ట్రస్థాయి స్టాండింగ్‌ కమిటీ సమావేశం జరిగింది. అందులో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్య దర్శి వికాస్‌రాజ్‌, ముఖ్య కార్యదర్శి ఎన్‌.శ్రీధర్‌తో పాటు సంబంధిత శాఖల ఉన్నతాధికా రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎస్‌ రామకృష్ణా రావు మాట్లాడుతూ పీఎంజీఎస్‌వైలో భాగంగా ఇప్పటి వరకు మూడుదశల్లో రాష్ట్రానికి మంజూరైన రహదా రులు, వంతెనల నిర్మాణ పనులను పూర్తి చేశామనీ, ఈ పథకం నాలుగోదశ కింద రాష్ట్రంలో పక్కా రహదారులు లేని 227 ఆవాసాలల్లో 642.23 కిలోమీటర్ల రహదా రుల నిర్మాణాలకు ప్రతిపాదనలు పంపాలన్నారు. పంచా యతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీధర్‌ మాట్లాడుతూ..34 పనులకు సంబం ధించి 148 కిలోమీటర్లకు అటవీశాఖ అనుమతులు పొందాల్సి ఉందనీ, ఆ మార్గాల్లో బ్రిడ్జిల నిర్మాణ పను లకు సంబంధించి వారం రోజుల్లో డీపీఆర్‌లను పూర్తి చేస్తామని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -