– పోలీసుల దాడి.. నిర్వాహకుల అరెస్ట్
– ఆరుగురు మహిళలకు రక్షణ
నవతెలంగాణ-కూకట్‌పల్లి
స్పా, మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారనే పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేసి నిర్వాహకులను అరెస్టు చేశారు. ఈ దాడిలో ఆరుగురు మహిళలను రక్షించినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కూకట్‌పల్లి ఎస్‌హెచ్‌ఓ కేవి సుబ్బారావు బుధవారం వివరాలు వెల్లడించారు. కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని భాగ్యనగర్ కాలనీలో ఉన్న చార్మ్ బ్యూటీ స్పాలో స్పా సేవల పేరుతో వ్యభిచారం జరుగుతున్నట్టు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. కూకట్‌పల్లి పోలీసులు యాంటి హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (ఏహెచ్‌టీయూ) బృందంతో కలిసి సంయుక్తంగా దాడి నిర్వహించారు. ఈ సందర్భంగా స్పా సెంటర్‌ను తనిఖీ చేయగా రిసెప్షన్ కౌంటర్ వద్ద ఇద్దరు మహిళలు, ఒక వ్యక్తి నిర్వాహకులుగా వ్యవహరిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. మహిళా పోలీసు సిబ్బంది సహకారంతో గదులను తనిఖీ చేసి ఆరుగురు మహిళలను రక్షించారు. ఒక విటుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు.
నిర్వాహకురాలు పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలుకు చెందిన పైడుముల దివ్య, స్థానిక జగద్గిరిగుట్ట నివాసి అల్వాలా సంగీత మాధురి, గుంటూరు జిల్లా వడ్లపూడికి చెందిన జయప్రకాశ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఘటనా స్థలం నుంచి నాలుగు స్మార్ట్ మొబైల్ ఫోన్లు, రూ.9,100, ఏడు కండోమ్‌లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు. స్పా, వెల్‌నెస్ సేవల ముసుగులో వ్యభిచారం వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌హెచ్‌ఓ హెచ్చరించారు. స్పా, మసాజ్ సెంటర్ యజమానులు సరైన లైసెన్స్‌లు, రిజిస్ట్రేషన్‌లు, అవసరమైన ధ్రువపత్రాలు తప్పనిసరిగా కలిగి ఉండాలని సూచించారు. ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.
స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



