నవతెలంగాణ – మునిపల్లి : సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుధేర చౌరస్తాలో రాష్ట్ర బీజేపీ శాఖ పిలుపు మేరకు మండల బీజేపీ అధ్యక్షుడు నాగిశెట్టి ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నాయకులు ధర్నా కార్యక్రమం నిర్వహించారు.జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశ సైనికులను కించపరిచే విదంగా పరుష పదజాలంతో మాట్లాడాడు.ఆపరేషన్ సింధూర్ చేసి దేశ గౌరవాన్ని పెంచి పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టించి ప్రపంచానికి మన దేశ సైనిక శక్తిని ప్రపంచానికి చాటారు మన జవాన్లు.అలాంటి జవాన్ల ధైర్య సాహసాలను ఒక ఉప ఎన్నిక ప్రచారం కోసం ఒక రాజ్యాంగ పదవిలో ఉండి సిగ్గులేని విదంగా మాట్లాడిన రేవంత్ రెడ్ దేశ సైనికులకు దేశ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు వీరన్న పాటిల్, క్రిష్ణ మూర్తి ,రవి .జిల్లా యువ మోర్చ మాజీ ఉపాధ్యక్షులు నాగేష్ యాదవ్ మండల యువ మోర్ఛ అధ్యక్షడు శేఖర్ SC మోర్ఛ అధ్యక్షడు నర్సింలు,మాజీ మండల అధ్యక్షుడు ఉపేందర్ ,మాజీ ప్రధాన కార్యదర్శి రఘురామ్,మాజీ మండల ఉపాధ్యక్షులు కాళిదాస్ ,ప్రవీణ్ , సంగమేశ్వర్, నగేష్ , ప్రవీణ్ వీరేశం దీపక్ , సీనియర్ నాయకులు బీజేపీ అభిమానులు పాల్గొన్నారు.
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు ఖండిస్తూ నిరసన కార్యక్రమం…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



