Monday, August 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్భూ కబ్జా చేసిన వ్యక్తులపై చర్య తీసుకోవాలంటూ నిరసన

భూ కబ్జా చేసిన వ్యక్తులపై చర్య తీసుకోవాలంటూ నిరసన

- Advertisement -

నవతెలంగాణ – కోహెడ
కోహెడ మండలంలోని సముద్రాల గ్రామంలో గాడ్లవారి కుంట శిఖం, కుంట కట్టలను ధ్వంసం చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. గతంలో తహాశీల్దార్‌కు వినతిపత్రం ఇచ్చారు. సోమవారం చెరువు కట్ట వద్దకు వచ్చి అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా అఖిలపక్షం నాయుకులు, గ్రామస్థులు అధికారులను నిలదీశారు. ఉదయం నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు  చెరువు కట్ట నుండి వెళ్లకుండా గ్రామస్తులు తహాశీల్దార్‌ను, కార్యదర్శిని అడ్డుకున్నారు.

చివరకు ఘటన స్థలానికి ఇరిగేషన్‌ అధికారులు  డిఈ రేష్మ చేరుకుని అఖిలపక్ష నాయకులకు, ప్రజలకు నచ్చజెప్పి కుంట కట్టలను ధ్వంసం చేసిన వారిపై తగు చర్యలు తీసుకుంటామని రెండు మూడు రోజులలో కుంట కట్టను నిర్మిస్తామని హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి వేల్పుల శ్రీనివాస్‌, జిల్లా కౌన్సిల్‌ మెంబర్‌ ముంజ గోపి, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా నాయకులు చింతకింది శంకర్‌, కాంగ్రెస్‌ పార్టీ గ్రామ శాఖ కార్యదర్శి పున్నం సత్తయ్య, బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు కొల్ల రాంరెడ్డి చాడ శ్రీనివాసరెడ్డి సుభాష్‌ గౌడ్‌, మౌటం సురేష్‌, వేల్పుల చంద్రశేఖర్‌, రైతులు, ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -