Saturday, January 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బీజేపీ ప్రభుత్వ కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసించండి

బీజేపీ ప్రభుత్వ కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసించండి

- Advertisement -

సిఐటియు రాష్ట్ర సహాయ కార్యదర్శి వంగూరు రాములు 
నవతెలంగాణ – ఆర్మూర్ 

బిజెపి ప్రభుత్వ కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను నిరసించాలని సిఐటియు రాష్ట్ర సహాయ కార్యదర్శి వంగూరు రాములు అన్నారు. పట్టణ వ్యవసాయ మార్కెట్ యార్డ్ నుండి శనివారం సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం ఆధ్వర్యంలో  కార్మిక కర్షక పోరుయాత్ర  జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వికాస భారత్ జి రామ్ జి చట్టాన్ని రద్దు చేయాలని, వామపక్షాల పోరాట ఫలితంగా 2005లో మాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి గ్యారెంటీ చట్టం రూపొందించడం జరిగిందని తెలిపారు.

వ్యవసాయ కార్మికులకు సంవత్సరంలో వంద రోజులు పని కల్పించాలని కానీ ప్రస్తుతం రోజుకు రూ.307 ఇవ్వాలని, దేశంలో మొత్తం వ్యయంలో 90 శాతం కేంద్రం, 10% రాష్ట్రాలు భరిస్తున్నాయని అన్నారు. ఈ చట్టం ద్వారా కరువుల్లో కరోనా సందర్భంగా గ్రామీణ ప్రజలకు ఉపాధి దొరికిందని, దేశంలో 741 జిల్లాలో ఈ కార్యక్రమం కొనసాగుతుందని అన్నారు. ఈ పథకానికి ఏటా 2.5 లక్షల కోట్లు కేటాయించాలని ఆందోళన జరుగుతుండగా కేంద్ర బిజెపి ప్రభుత్వం ఈ చట్టాన్ని మార్చి ఎత్తివేయడానికి ప్రయత్నాలు చేస్తుందని వెల్లడించారు.

మహాత్మా గాంధీ పేరు తొలగించడం బిజెపి నేరపూరిత స్వభావాన్ని బహిర్గతం చేస్తుందని అన్నారు. ప్రజా సంక్షేమం వల్లిస్తూనే 11 సంవత్సరాల పాలనలో బిజెపి ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు రూ.16 లక్షల కోట్లు రాయితీలు ఇచ్చిందని, చివరికి ప్రభుత్వ రంగ సంస్థలను ఆదాని, అంబానీ వంటి బడ పెట్టుబడిదారులకు కట్టబెడుతుందని ఆరోపించారు. అత్యంత ప్రమాదకరమైన నాలుగు లేబర్ కోడులను అమలు, విద్యుత్ సవరణ చట్టం విత్తన బిల్లు, విబి-జి, రామ్ జి చట్టం, భీమా రంగంలోనికి 100% విదేశీ పెట్టుబడులకు అనుమతి, చట్టాలను చేసిందని వీటికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా జరిగే ఆందోళన కార్యక్రమాలు తీవ్రతరం చేస్తామని అన్నారు. 

ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు శంకర్ గౌడ్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి పల్లపు వెంకటేష్, జిల్లా ఉపాధ్యక్షులు భూమన్న, సిఐటియు మండల కార్యదర్శి కూతాడి ఎల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -