నవతెలంగాణ – హైదరాబాద్ : పాకిస్థాన్ లో సింధు జలాల మళ్లింపుపై రైతులు చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఆందోళనకారులు జాతీయ రహదారిని దిగ్బంధించడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు ఆందోళనకారులు మరణించారు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకారులు పోలీసులపై దాడి చేశారు. గాయాలపాలైన వారినీ వదలకుండా ఆసుపత్రిలోకి వెళ్లి మరీ చేయిచేసుకున్నారు. లాఠీచార్జికి, కాల్పులకు ఆదేశాలిచ్చారనే అనుమానంతో నౌషేరో ఫిరోజ్ జిల్లాలోని మోరో తాలూకాలో ఉన్న సింధ్ హోంమంత్రి జియావుల్ హసన్ లాంజర్ ఇంటిపై ఆందోళనకారులు దాడిచేసి విధ్వంసం సృష్టించారు. అనంతరం హోంమంత్రి నివాసానికి నిప్పు పెట్టారు.
మంత్రి ఇంటిని తగలబెట్టిన నిరసనకారులు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES