Saturday, May 17, 2025
Homeరాష్ట్రీయంలేబర్‌ కోడ్‌ల రద్దు కోసం 20న నిరసనలు, ర్యాలీలు : సీఐటీయూ

లేబర్‌ కోడ్‌ల రద్దు కోసం 20న నిరసనలు, ర్యాలీలు : సీఐటీయూ

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్‌ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలనీ, ప్రభుత్వ రంగాన్ని రక్షించాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 20న పనిప్రదేశాల్లో, మండల, పట్టణ, జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శలు, ర్యాలీలు చేయాలని సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. శుక్రవారం ఈ మేరకు ఆ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్కరాములు, పాలడుగు భాస్కర్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులరీత్యా ఈ నెల 20న జాతీయ కార్మిక సంఘాలు, స్వంతత్ర ఫెడరేషన్లు, అసోసియేషన్లు తలపెట్టిన సార్వత్రిక సమ్మెను జులై తొమ్మిదో తేదీకి వాయిదా వేసినట్టు తెలిపారు. 20న తలపెట్టిన నిరసన ప్రదర్శనలు, ర్యాలీలను జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -