Friday, February 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజలకు మెరుగైన పాలన అందించాలి 

ప్రజలకు మెరుగైన పాలన అందించాలి 

- Advertisement -

ఎంపీడీవో పెరుమాళ్ళ జ్ఞాన ప్రకాష్ రావు 
నవతెలంగాణ – కట్టంగూర్

వార్డు సభ్యులు గ్రామాలలో ప్రజలకు మెరుగైన పాలనను అందించాలని ఎంపీడీవో పెరుమాళ్ళ జ్ఞాన ప్రకాష్ రావు అన్నారు. గ్రామపంచాయతీ వార్డు సభ్యులకు మొదటి విడతగా ఈనెల 16 నుండి శిక్షణ తరగతులు నిర్వహించ గా10 గ్రామాలకు చెందిన 106 మంది  సభ్యులకు శుక్రవారంతో శిక్షణ పూర్తయింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వార్డు సభ్యులు గ్రామాలను అభివృద్ధి చేసేందుకు, ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు. శిక్షణ పూర్తి చేసుకున్న వార్డు సభ్యులకు ధ్రువపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి స్వరూపరాణి, పర్యవేక్షకులు చింతమల చలపతి, టిఓటి లు వెంకన్న, మల్లేష్ ,నరసింహ స్వామి, సైదులు, పంచాయతీ కార్యదర్శులు, కార్యాలయ సిబ్బంది ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -