Monday, January 19, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మా గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించండి..

మా గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించండి..

- Advertisement -

ఎమ్మెల్యేకు దన్నూరు సర్పంచ్ జయశ్రీ వినతి..
నవతెలంగాణ – మద్నూర్ 

మా ఊరికి బస్సు సౌకర్యం కల్పించాలని మద్నూర్ మండలంలోని దన్నూరు గ్రామ సర్పంచ్ జయశ్రీ దేవదాస్ పటేల్ సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి తరలివెళ్లి వినతిపత్రాన్ని అందజేశారు. సర్పంచ్ విన్నపాన్ని ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు వెంటనే స్పందిస్తూ మీ ఊరికి త్వరలోనే బస్సు సౌకర్యం కల్పిస్తాననిహామీ ఇచ్చినట్లు సర్పంచ్ తెలిపారు.

ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న రవాణా సమస్యలను సర్పంచ్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు బస్సు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. దీనికి స్పందించిన ఎమ్మెల్యే ధనూర్ గ్రామానికి త్వరలోనే ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రజల అవసరాలను ప్రాధాన్యతగా తీసుకుని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఎమ్మెల్యేను కలిసినా వారిలో సర్పంచ్ వెంట ఆ గ్రామ ఉప సర్పంచ్ కుటుంబీకులు గ్రామ పెద్దలు గ్రామస్తులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -