Friday, November 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యార్థులకు మెటీరియల్ అందజేత..

విద్యార్థులకు మెటీరియల్ అందజేత..

- Advertisement -

నవతెలంగాణ – సదాశివనగర్
నేషనల్ మెన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ కు సంబంధించిన మెటీరియల్ జెడ్పిహెచ్ఎస్ ధర్మారావుపేట పాఠశాలలో హెల్పింగ్ బ్రిడ్జి ఫర్ ఎడ్యుకేషన్ సంస్థ, డిఆర్పిటి ఎన్నారై శాఖ ఆధ్వర్యంలో బండి ప్రవీణ్ సహకారంతో 18 మంది విద్యార్థులకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా హెల్పింగ్ బ్రిడ్జ్ ఫర్ ఎడ్యుకేషన్ సంస్థ ప్రతినిధి రాజు మాట్లాడుతూ.. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని రాబోయే స్కాలర్షిప్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి పాఠశాలకు గ్రామానికి మంచి పేరు తీసుకుని రావాలని, అందరూ అందించే అవకాశాలను వినియోగించుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తెలుగు రాజు, నరేందర్, జయపాల్ రెడ్డి, జాస్మిన్, చిన్నయ్య, స్వామి, సుకున, కృష్ణకర్ రావులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -