- Advertisement -
- – రూ. 20 కోట్లతో 170 అంగన్వాడీ కేంద్రాలు నిర్మిస్తాం..
- – అంగన్వాడి భవనాలను కేకే మహేందర్ రెడ్డి తో కలిసి ప్రారంభించిన కలెక్టర్
- నవతెలంగాణ – తంగళ్ళపల్లి
- అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు పౌష్టికాహారం అందించాలని, ప్రీ ప్రైమరీ పాఠాలు బోధించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. తంగళ్ళపల్లి మండలం చీర్లవంచలో నూతనంగా నిర్మించిన రెండు అంగన్వాడీ కేంద్రాల భవనాలను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, కే కే మహేందర్ రెడ్డి తో కలిసి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడారు.
- జిల్లాలో మొత్తం 585 అంగన్వాడీ కేంద్రాలు ప్రైవేట్ భవనాల్లో కొనసాగుతున్నాయని వివరించారు. డీఎంఎఫ్టీ నిధులు రూ. 20 కోట్లతో జిల్లాలోని ఆయా మండలాల్లో మొత్తం 170 అంగన్వాడీ కేంద్రాల నిర్మాణానికి రాష్ట్రప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. సిరిసిల్ల నియోజకవర్గం పరిధిలో మొత్తం 49 నిర్మాణానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. అన్ని భవనాలు రానున్న ఆరు నెలల్లో అందుబాటులోకి వస్తాయని కలెక్టర్ వెల్లడించారు. ఇందులో భాగంగా తంగళ్ళపల్లి మండలం చీర్లవంచలో నూతనంగా నిర్మించిన రెండు అంగన్వాడీ కేంద్రాల భవనాలను ప్రారంభించామని వివరించారు. ప్రీ ప్రైమరీ విద్య బలోపేతానికి అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
- నూతన భవనాలు నిర్మించి, మౌలిక వసతులు కల్పిస్తుందని పేర్కొన్నారు. పిల్లలు ఆడుతూ.. పాడుతూ విద్యను అభ్యసించే అవకాశం వస్తుందని వివరించారు. పక్కా భవనాలతో అంగన్వాడీ కేంద్రాల్లో అన్ని ఇబ్బందులు తొలగిపోతున్నాయని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు.కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, స్థానిక నాయకులు అధికారులు, పాల్గొన్నారు.
- Advertisement -