Sunday, October 5, 2025
E-PAPER
Homeజాతీయంరష్యా నుంచి పీఎస్‌యూల ఆయిల్‌ కొనుగోళ్ల కొనసాగింపు

రష్యా నుంచి పీఎస్‌యూల ఆయిల్‌ కొనుగోళ్ల కొనసాగింపు

- Advertisement -

న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగంలోని ఇండియన్‌ ఆయిల్‌, బీపీసీఎల్‌ కంపెనీలు భవిష్యత్‌లోనూ రష్యా నుంచి చమురును కొనుగోలు చేయనున్నట్టు ప్రకటించాయి. రష్యన్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధరలో తగ్గింపు పెరగడంతో సెప్టెంబర్‌, అక్టోబర్‌ డెలివరీల కోసం కొనుగోళ్లను తిరిగి ప్రారంభించినట్లు చమురు కంపెనీల వర్గాలు వెల్లడించాయి. రష్యాకు చెందిన ప్రముఖ ఉరల్స్‌ క్రూడ్‌పై డిస్కౌంట్‌ బ్యారెల్‌కు సుమారు మూడు డాలర్లను తగ్గింపును ప్రకటించింది. ఇది భారతీయ రిఫైనరీలకు ఆకర్షణీయంగా మారిందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.. రష్యన్‌ ఆయిల్‌ కొనుగోళ్లపై వాషింగ్టన్‌ నుంచి విమర్శలు రావడం, జులైలో డిస్కౌంట్లు తగ్గడంతో ఈ రిఫైనరీలు కొనుగోళ్లను నిలిపివేశాయి. అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఆగస్టు 27 నుంచి భారతీయ వస్తువులపై అదనపు 25 శాతం సుంకం విధిస్తామని బెదిరించిన విషయం తెలిసిందే. మాకు రష్యన్‌ క్రూడ్‌ను కొనమని లేదా కొనవద్దని ఎవరూ చెప్పలేదని ఐఓసీ చైర్మెన్‌ అరవిందర్‌ సింగ్‌ సహ్నీ తెలిపారు. తాము ఆర్థిక ప్రయోజనాల ఆధారంగా నిర్ణయం తీసుకుంటామన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -