హీరో శ్రీ నందు నటించిన చిత్రం ‘సైక్ సిద్ధార్థ’. వరుణ్ రెడ్డి దర్శకత్వం వహించారు. స్పిరిట్ మీడియా, నందునెస్ కీప్ రోలింగ్ పిక్చర్స్ బ్యానర్లపై శ్రీ నందు, శ్యామ్ సుందర్ రెడ్డి తుడి నిర్మించారు.
ఈ చిత్రంలో యామిని భాస్కర్ కథానాయికగా నటించారు. సురేష్ ప్రొడక్షన్ ద్వారా ఈనెల 1న గ్రాండ్‌గా రిలీజైన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకొని, సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది.
ఈ సందర్భంగా మేకర్స్ న్యూ ఇయర్ బ్లాక్ బస్టర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. హీరో శ్రీ నందు మాట్లాడుతూ,’ఈరోజు కోసమే 18 ఏళ్లుగా ఎదురు చూశాను.
ఒక బ్లాక్‌బస్టర్ పోస్టర్‌తో మీ అందరి ముందు మాట్లాడాలని, సక్సెస్ ఇచ్చిన డైరెక్టర్‌కి థ్యాంక్స్ చెప్పాలని ఎదురు చూశాను. నేను ఎన్నో సినిమాలు చేశాను. కానీ సురేష్ బాబు దగ్గరికి వెళ్లలేదు. ఈ సినిమా వెళ్లిందంటే కారణం డైరెక్టర్ వరుణ్ విజన్. ఈ సినిమా క్రెడిట్ అంతా వరుణ్‌కే దక్కుతుంది. సినిమా హౌస్‌ఫుల్‌గా రన్ అవుతుంది. థియేటర్‌లో ఒక మాస్ సినిమాని ఎంజాయ్ చేస్తున్నట్టుగా చూస్తున్నారు. ఈ సినిమాని ఇంత గ్రాండ్‌గా సెలబ్రేట్ చేస్తున్న ఆడియన్స్ అందరికీ థ్యాంక్యూ సో మచ్. ఈ సినిమాకి అద్భుతమైన రివ్యూలు వచ్చాయి’ అని తెలిపారు.
‘సైక్ సిద్ధార్థ’కి అద్భుత స్పందన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



