Saturday, November 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజా చైతన్యమే కళాకారుల ధ్యేయంగా పనిచేయాలి

ప్రజా చైతన్యమే కళాకారుల ధ్యేయంగా పనిచేయాలి

- Advertisement -

ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్
నవతెలంగాణ-గోవిందరావుపేట

అణగారిన వర్గాల చైతన్య కోసం కళాకారులు కృషి చేయాలని ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ అన్నారు. శనివారం పసర సీపీఐ(ఎం) కార్యాలయంలో ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో ములుగు డివిజన్ స్థాయి శిక్షణ తరగతులు గుగ్గిళ్ళ దేవయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆనంద్ మాట్లాడుతూ.. కల కాసుల కోసం కాదు.కల ప్రజల కోసం ఉపయోగపడాలని అన్నారు. అనేక ఉద్యమాలు కళారూపాల ద్వారానే ఉద్భవించాయని ఆయన తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం కళ ఎంతో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. కళాకారులు తమ కళారూపాలను అభివృద్ధి చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజానాట్యమండలి రాష్ట్ర సహాయ కార్యదర్శి నక్క సైదులు, పొదిల్ల చిట్టిబాబు,అంబాల మురళి, ప్రవీణ్, నాగరాజు,కవిత,  సువర్ణ. రాజు, చిరంజీవి, కృష్ణ బాబు ,దామోదర్, విజయ్ కుమారి, ఐలయ్య , రాజు, రామకృష్ణ , రాజేష్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -