Tuesday, March 24, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిప్రజాప్రయోజనమేదీ?

ప్రజాప్రయోజనమేదీ?

- Advertisement -

రాష్ట్రంలోని అనేక మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల్లో ఒక సాధారణ ధోరణి కనిపిస్తోంది. ప్రజాప్రతినిధుల పదవీకాలం ముగింపు సమయం దగ్గరపడినప్పుడు మాత్రమే రోడ్ల మరమ్మతులు, డ్రెయినేజీ శుభ్రపరిచే పనులు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు హడావుడిగా ప్రారంభమవుతున్నాయి. తర్వాత ‘యథారాజ,తదా ప్రజా’ అన్నట్టుగానే సాగుతోంది. పజల పన్నుల ద్వారా వచ్చిన అభివృద్ధి నిధులు చాలాకాలం వినియోగం లేకుండా నిల్వ ఉండటం, చివర్లో ఒక్కసారిగా ఖర్చుచేయడం ఒక ఆందోళనకర అంశం. అభివృద్ధి పనులు సమయానికి చేపట్టకపోవడం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు చేయాల్సిన డ్రెయినేజీ పనులు వర్షాకాలంలో చేపడితే ఏం ఉపయోగం? ముఖ్యంగా వర్షాలు పడినప్పుడు డ్రెయినేేజీ వ్యవస్థలు సరిగా లేకపోవడం వల్ల నీరు నిల్వ ఉండటం, రోడ్లు దెబ్బతినడం, ప్రమాదాలు జరగడం వంటి సమస్యలు తరచుగా జరుగుతున్నాయి. బస్తీ ప్రాంతాల్లో నివసించే ప్రజలు మరింతగా ఇబ్బందులు పడుతూ ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారు. హడావుడిగా చేసే పనుల్లో నాణ్యత లోపించడం సాధారణమైంది. సరైన ప్రణాళిక లేకుండా చేసిన రోడ్లు త్వరగా దెబ్బతింటాయి, డ్రెయినేజీ పనులు తాత్కాలిక పరిష్కారాలకే పరిమితమవుతాయి. దీనివల్ల ప్రజా నిధులు సరైన ఫలి తాన్ని ఇవ్వకుండా వృథా అవుతున్నాయి.అలాగే పదవీకాలం చివర్లో నిర్వహించే ”అభివృద్ధి పర్యటనలు”. అభివృద్ధి నమూనాలను అధ్యయనం చేయడం అవసరమే అయినప్పటికీ, వాటిని అమలు చేసే సమయం లేకుండా చివరలో చేపట్టడం ప్రజల్లో అనుమానాలకు దారితీస్తోంది. ప్రజాప్రతినిధులు ప్రజాసేవ కోసం ఎన్నికయ్యారు. వారి జీతాలు, భత్యాలు, అభివృద్ధి నిధులన్నీ ప్రజలనుంచే వస్తాయి. గనుక, ఈ నిధులను బాధ్యతాయుతంగా వినియోగించడం వారి ప్రధాన బాధ్యత. సమయానికి ప్రణాళికాబద్ధంగా నిధులను వినియోగిస్తే మంచి నాణ్యతతో మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి, ప్రమాదాలు తగ్గుతాయి, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి.అందువల్ల అభివృద్ధి పనుల అమలులో సమయపాలన, పారదర్శకత, బాధ్యత చాలా ముఖ్యం.
– పోరిక సురేష్‌, ములుగు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -