నవతెలంగాణ – వనపర్తి
గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జిల్లా ప్రజలంతా భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించాలని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ సూచించారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని విద్యానగర్ కాలనీ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రతిష్టించిన వినాయక మండపంలో ఆదివారం గణనాథుడి సహస్ర పుష్ప అర్చన పూజ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ సతీ సమేతంగా పాల్గొని ఘనంగా పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రజలు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించుకోవాలని, అందరు తాము మొదలు పెట్టిన పనులు ఎలాంటి విఘ్నాలు లేకుండా పూర్తి అయ్యేటట్లు చూడాలని, కష్టాలను తొలగించి ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలను నింపాలని మహాగణపతిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా వనపర్తి జిల్లా పరిధిలోని ప్రజలలో ఉన్న సోదరభావం, ఐక్యత ఎంతో సంతోషాన్ని కల్పిస్తుందని ప్రజలందరూ సోషల్ మీడియాలో వచ్చే వదంతులు పుకార్లపై అప్రమత్తంగా ఉండాలని అపోహలకు గురి కావద్దని, ఏదైనా సమస్య ఉన్న ఏదైనా సమాచారం ఉన్నట్లయితే డయాల్ 100,స్థానిక పోలీసులు సమాచారం అందించాలని ఇదేరీతిలో ఈరోజు నుండి నిమజ్జనం రోజు వరకు ప్రతి ఒక్కరు పోలీసు వారికి సహకరించాలని ఎటువంటి ఆటంకాలు లేకుండా నవరాత్రులు, నిమజ్జన శోభయాత్ర నిర్వహించుకోవాలని కాలనీ వాసులకు జిల్లా ప్రజలకు ఎస్పీ గారు విజ్ఞప్తి చేశారు. ఈ పూజ కార్యక్రమంలో ఎస్పీ సతీమణి, తెలంగాణ రాష్ట్ర బాలల పరిరక్షణ సమితి సభ్యురాలు బండి అపర్ణ, వినాయక మండప నిర్వాహకులు కాలనీవాసులు, ఎస్పీ సీసీ మధు, సూరా రవీందర్, పురుషోత్తంశెట్టి, నరేంద్రచారి, భాస్కర్ నాయక్, గట్టయ్య, వెంకటరెడ్డి, నరసింహారెడ్డి, రవి కుమార్ రెడ్డి, వెంకట్ స్వామి, రామకృష్ణ, కాలనీ మహిళలు అశ్విని, ప్రసన్న, మంజుల, పల్లవి, నేహా, మానస, లలిత, సరస్వతి, భారతి, సూర్య కళ, సరిత, తదితరులు పాల్గొన్నారు.
భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించాలి : జిల్లా ఎస్పీ రావుల గిరిధర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES