Saturday, May 17, 2025
Homeఅంతర్జాతీయంపుతిన్‌, ట్రంప్‌ సమావేశం అవసరమే ! కానీ..

పుతిన్‌, ట్రంప్‌ సమావేశం అవసరమే ! కానీ..

- Advertisement -

క్రెమ్లిన్‌ వ్యాఖ్యలు
మాస్కో : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మధ్య సమావేశం అవసరమైనదేనని, అయితే దానికి ముందస్తుగా చాలా సన్నాహాలు అవసరమని, సమావేశమంటూ జరిగితే కచ్చితంగా ఫలితం సాధించాల్సిందేనని క్రెమ్లిన్‌ ప్రతినిధి దిమిత్రి పెస్కొవ్‌ శుక్రవారం వ్యాఖ్యానించారు. సాధ్యమైనంత త్వరగా పుతిన్‌తో తాను భేటీ కావాలనుకుంటున్నట్లు ట్రంప్‌ వ్యాఖ్యానించిన నేపథ్యంలో పెస్కొవ్‌ వ్యాఖ్యలు వెలువడ్డాయి. అమెరికా, రష్యా ద్వైపాక్షిక సంబంధాల దృష్ట్యా చూస్తే ఈ సమావేశం కచ్చితంగా ప్రాధాన్యత గలదే, అంతర్జాతీయ వ్యవహారాలపై,అలాగే ప్రాంతీయ సమస్యలపై ఉన్నతస్థాయిలో తీవ్రంగా చర్చించడం అవసరమేనని పెస్కొవ్‌ పేర్కొన్నారు. ఇస్తాంబుల్‌లో జరుగుతున్న రష్యా, ఉక్రెయిన్‌ మధ్య చర్చల గురించి ప్రస్తావిస్తూ, రష్యా ప్రతినిధి బృందం మాస్కో నాయకత్వానికి నిరంతంగా సమాచారం తెలియచేస్తోందని చెప్పారు. వాస్తవ సమాచారం పుతిన్‌కు అందుతోందన్నారు.
మరోవైపు రష్యా, ఉక్రెయిన్‌ మధ్య శాంతి ఒప్పందాన్ని ఖరారు చేసేందుకు పుతిన్‌, ట్రంప్‌ సమావేశం అవసరమని ట్రంప్‌ డిప్యూటీ అసిస్టెంట్‌ సెబాస్టియన్‌ గోర్కా చెప్పారు. సరైన తరుణం ఆసన్నమైందని ఆయన వ్యాఖ్యానించారు. అంతకుమించి వివరాలు వెల్లడించలేదు.
ముగిసిన రష్యా, ఉక్రెయిన్‌ చర్చలు యుద్ధ ఖైదీల విడుదల ఒప్పందానికి ఓకే
ఇస్తాంబుల్‌ : గత మూడేళ్ళలో మొదటిసారిగా రష్యా, ఉక్రెయిన్‌ ప్రతినిధుల మధ్య ప్రత్యక్షంగా చర్చలు జరిగాయి. యుద్ధానికి ముగింపునివ్వాలనే ఉద్దేశ్యంతో జరిగిన ఈ చర్చలు దాదాపు రెండు గంటల పాటు సాగాయి. కానీ ఈ చర్చల పట్ల ఎవరూ పెద్దగా ఆశలు పెట్టుకోలేదు.
బేషరతుగా కాల్పుల విరమణ జరగాలన్నది ఉక్రెయిన్‌ డిమాండ్‌గా వుంది. అసలు ఈ ఘర్షణలకు మూల కారణాలను పరిష్కరించాలన్నది రష్యా అభిమతంగా వుంది. శాంతి చర్చలు ముగిసిన అనంతరం రష్యా ప్రతినిధి బృంద నేత వ్లాదిమిర్‌ మెదినిస్కీ మాట్లాడుతూ, ఇరు దేశాలు చెరో వెయ్యి మంది ఖైదీలన విడుదల చేసేందుకు అంగీకరించాయని చెప్పారు. 2022లో యుద్ధం ప్రారంభమైన తర్వాత కుదిరిన అతిపెద్ద యుద్ధ ఖైదీల మార్పిడి ఒప్పందమిది. చర్చలను పక్క దారి పట్టించేందుకు రష్యా అనామోదయోగ్యమైన ప్రాదేశిక డిమాండ్లు చేస్తోందని ఉక్రెయిన్‌ దౌత్య వర్గాలు వ్యాఖ్యానించాయి. ఒకవేళ చర్చలు విఫలమైతే ప్రపంచ దేశాలు తీవ్రంగా ప్రతిస్పందించాలని జెలెన్‌స్కీ కోరారు. కొత్తగా రష్యాపై ఆంక్షలు విధించాలన్నారు. అల్బానియాలో యురోపియన్‌ సదస్సులో మాట్లాడుతూ జెలెన్‌స్కీ ఈ వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -