కానీ.. ఇందుకు పరస్పర రాజకీయ సంకల్పం ఉండాలి : క్రెమ్లిన్ వెల్లడి
మాస్కో : ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మ్యాక్రాన్‌తో చర్చలు పరిపేందుకు రష్యా అధినేత పుతిన్ సిద్ధంగా ఉన్నారని క్రెమ్లిన్ వెల్లడించింది. ఇందుకు ఇరు పక్షాల్లోనూ పరస్పర రాజకీయ సంకల్పం ఉండాలని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ తెలిపారు. ఈ వ్యాఖ్యలను రష్యా వార్తా సంస్థ ఆర్‌ఐఏ ప్రచురించింది. ”పరస్పర రాజకీయ సంకల్పం ఉంటే.. దానిని సానుకూలంగానే చూడాలి” అని పెస్కోవ్ తెలిపారు. రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం నేపథ్యంలో అమెరికా, పలు యూరప్ దేశాలు రష్యాకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న విషయం విదితమే. ఇలాంటి తరుణంలో ఫ్రాన్స్ అధ్యక్షుడితో చర్చలకు రష్యా నుంచి ఇలాంటి ప్రకటన రావటం ప్రాధాన్యతను సంతరించుకున్నది. క్రెమ్లిన్ నుంచి ప్రకటనను మ్యాక్రాన్ స్వాగతించారు.
మ్యాక్రాన్‌తో చర్చలకు పుతిన్ సిద్ధం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



