జిల్లా విద్యాధికారి భోజన్న..
నవతెలంగాణ-కుభీర్
ప్రభుత్వ పాఠశాలలో చదువులకునే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న అన్నారు. గురువారం మండలంలోని పార్డి( బి ) ప్రభుత్వ ఉన్నాత పాఠశాల ప్రాథమిక పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ క్రమంలో ఉన్నత పాఠశాల విద్యార్థుల తరగతి గదులకు వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలను శ్రద్ధగా విని మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థులకు సూచించారు. అదేవిధంగా మధ్యాహ్న భోజనం వంటశాలను పరిశీలించి, మెనూ ప్రకారం భోజనం అందుతుందా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వంటగదిని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని నిర్వాహకులకు ఆదేశించారు. దీంతోపాటు ప్రీ ప్రైమరీ పాఠశాలను పరిశీలించి, పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను మరింతగా పెంచేలా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు ప్రభుత్వం అందించే అన్ని వసతులను అందిస్తామని చెప్పారు. అనంతరం పాఠశాలకు సంబంధించిన పలు రికార్డులను తనిఖీ చేశారు. అయన వెంట మండల విద్యాధికారి విజయ్ కుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు నారాయణరెడ్డి, మోసిన్ విద్యార్థులు ఉన్నారు.
విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనం అందించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



