Thursday, May 29, 2025
Homeజిల్లాలుసర్కారు బడుల్లోనే నాణ్యమైన విద్య: ఎంఈఓ

సర్కారు బడుల్లోనే నాణ్యమైన విద్య: ఎంఈఓ

- Advertisement -

నవతెలంగాణ – దుబ్బాక : సర్కారు బడుల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని, సకల వసతులతో విద్యార్థులకు అర్థమయ్యేవిధంగా డిజిటల్ పాఠాల్ని బోధిస్తున్నామని ఎంఈఓ దోమకొండ అంజయ్య అన్నారు. సోమవారం అక్బర్ పేట భూంపల్లి మండలం రామేశ్వరంపల్లి జడ్పీహెచ్ఎస్ లో నిర్వహించిన ‘పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ‘ కి ఎంఈఓ అంజయ్య ముఖ్య అతిథిగా హాజరైనారు. అనంతరం ఉపాధ్యాయ బృందంతో కలిసి చిన్ననిజాంపేట, రామేశ్వరంపల్లి, కూడవెల్లి గ్రామాల్లో ‘జయశంకర్ బడిబాట’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం నీలం శ్రీనివాస్, ఉపాధ్యాయులు కూరాకుల శ్రీనివాస్, ఇస్మాయిల్, రాజేశం, గ్రామస్తులు పూజారి మల్లేశం, పరశురాం, యాదగిరి పలువురు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -