No menu items!
Monday, September 1, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య: ఎంఈఓ

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య: ఎంఈఓ

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు: ప్రభుత్వ పాఠశాలల్లోనే అర్హులైన ఉపాధ్యాయులచే నాణ్యమైన విద్యను అందిస్తారని మండలం ఎంఈఓ లక్ష్మన్ బాబు తెలిపారు. ప్రొపెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా సోమవారం మండలంలోని తాడిచెర్ల, మల్లారం, ఎడ్లపల్లి మోడల్ స్కూల్, దుబ్బపేటలోని కస్తూర్బా ఆశ్రమ పాఠశాలలో బడిబాట కార్యక్రమాలు, పురవీధుల్లో ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడారు. ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు తమ భాగస్వామ్యంతో ఉత్తమ విద్యా ప్రమాణలు కలిగిన, ఉత్తమ విద్యను అందించే ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులను పంపించాలని కోరారు. బడిడు పిల్లలను బడుల్లో చేర్పించేలా ఉపాధ్యాయులతో సంయుక్తంగా చొరవ తీసుకోవాలని చూచించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, ఏఎమ్మార్ ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad