రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసిన కేసీఆర్‌పై విచారణ సిగ్గుచేటు : కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సీబీఐ పనితీరుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి ద్వంద్వ వైఖరితో ఉన్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. బుధవారం ఎర్రవెల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో పినపాక నియోజకవర్గం మణుగూరు కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత ప్రభాకర్‌రావు తన అనుచరులతో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసిన కేసీఆర్‌పై విచారణ సిగ్గుచేటన్నారు. సీబీఐ మోడీ జేబు సంస్థ అని రాహుల్‌గాంధీ విమర్శించారనీ, సీఎం రేవంత్ సీబీఐని పొగుడుతు న్నారని తప్పుపట్టారు. కాంగ్రెస్, బీజేపీలు కక్ష పూరితంగా అక్రమ కేసులతో కేసీఆర్‌ను అప్రతిష్టపాలు చేయాలని కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. రేవంత్ రెడ్డి 21 నెలల పాలనతో ప్రజలు విసిగిపోయారనీ, కేసీఆర్ హయాంలోనే బాగుందని అంటున్నా రని తెలిపారు. ఎన్నికల ముందు హామీల జాతర, తర్వాత చెప్పుల జాతర అన్నట్టు రాష్ట్రం లో యూరియా కొరత రైతులను వేధి స్తోందని తెలిపారు. వ్యవసాయ దిగుబడుల్లో 14వ స్థానంలో ఉన్న తెలంగాణను అనేక ప్రాజెక్టుల తో దేశానికే అన్నం పెట్టేస్థాయికి కేసీఆర్ తెచ్చారని గుర్తుచేశారు. రేవంత్‌రెడ్డి మాటలు సీఎం హౌదాకు తగినట్టు లేవనీ, పనిచేయడం చేతకాక సాకులు వెతుకుతున్నా రని ఎద్దేవాచేశారు. కేసీఆర్ ప్రభుత్వం రూ.2.80 లక్షల కోట్లు మాత్రమే అప్పు చేశారని పార్ల మెంటులో కేంద్రమంత్రి చెప్పారని గుర్తుచేశారు.
సింగరేణి ప్రాంతంలోని 13 నియోజకవర్గాల్లో పార్టీ ఎందుకు ఓడ ిపోయిందో లోతుగా అధ్యయనం చేయాలని కేటీఆర్ సూచించారు. సింగరేణి కార్మికులకు 10 హామీలిచ్చి వాటిలో బీఆర్‌ఎస్ ఎనిమిదింటిని పూర్తిగా, రెండింటిని పాక్షికంగా అమలు చేసిందని తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పదికి పది అసెంబ్లీ స్థానాల్లో గులాబీ జెండా ఎగర వేయాలని కేటీఆర్ పార్టీ కార్యకర్తలు, నాయకులకు పిలుపునిచ్చారు. ఈ నెల 10, 11 తేదీల్లో తాను భద్రా చలం, కొత్తగూడెం పర్యటనకు వస్తు న్నట్టు తెలిపారు. చిన్న చిన్న మన స్పర్థలు పక్కనపెట్టి, అందరూ కలిసి కట్టుగా పని చేసి స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు, రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ సత్తా చాటాలని కోరారు. ఇంకా మూడేండ్లు అధికార పార్టీలో ఉండే అవకాశం ఉన్నప్పటికీ, అక్కడ ఉండలేక బీఆర్‌ఎస్‌లో చేరిన ప్రభాకర్‌రావు, ఆయన అనుచరులకు కేటీఆర్ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.