ఎనిమిది నెలల్లోనే 100 కోట్ల టన్నుల డెలివరీ
అందులో సగం పైగా బొగ్గు
న్యూఢిల్లీ : భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న భారత రైల్వే సరుకు రవాణలో దూసుకుపోతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) ఏప్రిల్ నుంచి నవంబర్ 19 మధ్య కాలంలో ఏకంగా 100 కోట్ల (1 బిలియన్) టన్నుల సరుకు రవాణతో నూతన మైలురాయిని సాధిం చింది. రైల్వే మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం.. కేవలం తొమ్మిది నెలల్లోనే 102 కోట్ల టన్నుల సరకులను రవాణ జరిగింది. అత్యధికంగా బొగ్గు 50.5 కోట్ల టన్నుల సరఫరా నమోదయ్యింది. ఆర్థిక సంవత్సరం 2025-26లో నవంబర్ 19 నాటికే రైల్వేలు 1 బిలియన్ టన్నుల (100 కోట్ల టన్నులు) సరుకు రవాణా మార్కును అధిగమిం చడం విశేషం.
గతేడాది రోజుకు 4.2 మిలియన్ టన్నులు (42 లక్షల టన్నులు) సరకు రవాణ నమోదు కాగా.. ఈ ఏడాదిలో సగటున రోజుకు 44 లక్షల టన్నుల సరకు రవాణ జరిగిందని.. రైల్వేల నిర్వహణ సామర్థ్యం పెరిగిందని ఆ మంత్రిత్వ శాఖ పేర్కొంది. గతేడాది ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు 90.69 కోట్ల టన్నుల సరుకు రవాణా జరగగా, ఈ సంవత్సరం అదే కాలంలో 93.51 కోట్ల సరుకు రవాణ నమోదయ్యింది. ఇది ఆరోగ్యకరమైన వృద్ధిని సూచిస్తుందని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. భారతదేశ మౌలిక సదుపాయాల వృద్ధిలో కీలక పాత్ర ను సిమెంట్ రవాణ సామర్థ్యాలను మరింత పెంచ డానికి చర్యలు తీసుకున్నట్లు ఆ శాఖ పేర్కొంది. బల్క్ వస్తువుల రవాణాను రోడ్డు మార్గం నుండి రైలు మార్గానికి మార్చడం వల్ల కర్బన ఉద్గారాలు తగ్గడంతో పాటుగా అనేక వాణిజ్యేతర ప్రయోజనా లు ఉన్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.




