నవతెలంగాణ – మద్నూర్ : మద్నూర్ మండలంలోని అవల్గావ్ గ్రామ శివారు ప్రాంతంలో గల గణపతి ఆలయం వద్ద మంగళవారం ఆ గ్రామస్తులంతా కలిసి పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. గణపతి ఆలయంలో మహిళలు ప్రత్యేకంగా పూజలు చేశారు. అన్నదానం చేపట్టి వర్షం కోసం మొక్కుకున్నారు. ఈ ఏడాది పంటలు సాగు చేసి 15 రోజులు గడుస్తున్నా .. వర్షాలు పడక సాగు చేసిన మొలకలు వేసవి ఎండలకు ఆరిపోతున్నాయి. పత్తి పంట మొలకలను చీడపురుగులు నాశనం కలిగిస్తున్నాయి. ఖరీఫ్ పంటల సాగుకు వరుణుడు కరుణించలేక రైతులంతా ఆందోళన చెందుతూ అన్నదానాలతో వరిణుడు కరుణిస్తాడేమోనని అవల్గావ్ గ్రామ శివారులో గల గణపతి ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆ గ్రామ పెద్దలు మహిళలు గ్రామస్తులు ముఖ్యంగా వ్యవసాయదారులు పాల్గొన్నారు.
గణపతి ఆలయం వద్ద వర్షం కోసం మొక్కులు
- Advertisement -
- Advertisement -



