Saturday, May 10, 2025
Homeతెలంగాణ రౌండప్ప్రజలను మోసం చేస్తున్న రాజగోపాల్ రెడ్డి ..

ప్రజలను మోసం చేస్తున్న రాజగోపాల్ రెడ్డి ..

- Advertisement -

చండూరులో విరుచుకుపడిన మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి..
తన ఇష్టారాజ్యంగా రోడ్డు నిర్మాణ పనులు 
నవతెలంగాణ – చండూరు  
: మునుగోడు ప్రజల ఓటుతో గెలిచి, మునుగోడు ప్రజల్ని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మోసం చేస్తున్నారని బిఆర్ఎస్ మునుగోడు నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి  అన్నారు. శనివారం చండూర్ జరుగుతున్న రోడ్డు విస్తరణలో ఎమ్మెల్యే  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి నిరసనగా విస్తృత పర్యటన చేశారు. ఆయన వ్యతిరేకంగా గోల్మాల్ రాజగోపాల్ రెడ్డి అంటూ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆయన  రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించి మాట్లాడారు. సగం సగం రోడ్లు వేసి మధ్యలో ఆపేసి, అటు వాహనదారులకు, ఇటు బాటసారిలకు ఇబ్బందులు కలుగజేస్తున్నారని అన్నారు. ఆయన భాద్యతరాహిత్యంగా వ్యవహరిస్తున్నారని ఈ సందర్బంగా మండిపడ్డారు. ఇటీవల కురిసిన  అకాల వర్షాలకు రోడ్లపై నీరు నిలిచి, చిందరవందరగా మారాయి అన్నారు. 100 ఫీట్ల  రోడ్డను ఏర్పాటు చేయకుండా,  తన ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్నారని, రాబోయే రోజుల్లో భవిష్యత్ తరానికి ఇబ్బందిగా ఉంటుందని విమర్శించారు. చండూరు మున్సిపల్ ప్రజలు అన్నం తిని కాకుండా, సంవత్సర కాలంగా దుమ్ము, ధూళితో తిని  బ్రతుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మునుగోడు నియోజవర్గంపై  అవగాహన లేని ఎమ్మెల్యే,  నియోజకవర్గ  అభివృద్ధి  ఎలా చేయాలో అర్థం కాని అసమర్థత ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అని విమర్శించారు. ఆయనకు మంత్రి పదవి పైన ఉన్న శ్రద్ధ, ఇక్కడి ప్రాంతం పై లేదన్నారు. ఆయన కోతలు మాటలు తప్పా అభివృద్ధి చేసింది  శూన్యం అన్నారు. తన రాజీనామాతో మునుగోడు అభివృద్ధి చెందని పదేపదే చెబుతున్నావు.. దమ్ముంటే మళ్ళీ రాజీనామా చేయి అధిక నిధులు వస్తాయని ఎద్దేవ చేశారు.వడ్ల కొనుగోలు కేంద్రాలపై ఎమ్మెల్యే శ్రద్ధ లేదని తనకు రైతులు ఫోన్ చేశారన్నారు. రైతులు వడ్లు అమ్మేందుకు ఇబ్బందులు పడుతున్నారు. కేంద్రాలు సరిగా పనిచేయక వర్షాలకు  వడ్లు ఆగమయ్యాయి అన్నారు. ప్రభుత్వం మాత్రం కళ్ళు మూసుకొని కూర్చుంది అని విమర్శించారు.నా హయాంలో ప్రారంభించిన మునుగోడు క్యాంపు కార్యాలయాన్ని తొలగించడం నిరంకుశత్వం,   క్యాంపు కార్యాలయాన్ని నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నిర్మించాను అని ఇప్పుడు ఆ కార్యాలయంపై నా పేరు ఉన్న శిలాఫలకాన్ని తీసేసి, తన పేరుతో కొత్తదాన్ని శ్రీకారం చుట్టారని, ఇది సార్వత్రిక ప్రమాణాలకు వ్యతిరేకంగా, పూర్తిగా నిరంకుశంగా చేసిన పని,” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.గ్రామాల్లో నా హయాంలో వేసిన శిలాఫలకాలను కూడా కూలుస్తున్నారు” అని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలందరూ మళ్ళీ కెసిఆర్ ఏ రావాలని ఎదురు చూస్తున్నారని అన్నారు. తప్పకుండా ఆ రోజులు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ  మున్సిపల్ చైర్ పర్సన్ తోకల చంద్రకళ  వెంకన్న,  మాజీ జెడ్పిటిసి కర్నాటి వెంకటేశం,  మండల అధ్యక్షుడు పాటల వెంకన్న, పట్టణ అధ్యక్షులు కొత్త పార్టీ సతీష్, కౌన్సిలర్లు  కోడి వెంకన్న, అన్నపర్తి శేఖర్, గుర్రం వెంకట్ రెడ్డి, తేలు కుంట్ల చంద్రశేఖర్, ఎత్తపు  మధుసూదన్ రెడ్డి, అనిల్ రావు,  చొప్పరి దశరథ యాదవ్,మాజీ సర్పంచులు,  బి ఆర్ స్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -