నవతెలంగాణ – వనపర్తి
వనపర్తి జిల్లా రాజీవ్ గృహకల్పలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) ఆధ్వర్యంలో ఆదివారం సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి లక్ష్మి మాట్లాడుతూ అక్కడి ప్రజలు తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. ముఖ్యంగా నీటి సమస్య, డ్రైనేజీ నుండి వస్తున్న దుర్వాసన స్థానికులను ఇబ్బంది పెడుతుందని పేర్కొన్నారు. మొత్తం 120 కుటుంబాలకు ఇండ్లు కేటాయించినప్పటికీ 45 కుటుంబాలు మాత్రమే అక్కడ నివాసం ఉంటున్నాయి. మిగతా కుటుంబాలు కిరాయికి వెళ్లి ఉంటున్న పరిస్థితి నెలకొంది.
కిరాయి ఉన్నవారిని కూడా చులకనగా చూసే పరిస్థితి ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించకపోయినా, వాటర్ వేసుకునే సమయానికి మాత్రం సమస్యలు చెప్పవద్దని అధికారుల వైఖరిని ఆమె ఖండించారు. డ్రైనేజీ వెంటనే శుభ్రం చేయించాలన్నారు. నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. కాలనీలో రేషన్ షాపు ఏర్పాటు చేయాలన్నారు. ప్రాథమిక వైద్య సదుపాయం కల్పించాలన్నారు. అంగన్వాడి కేంద్రం నియమించాలన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షురాలు సాయిలీల కోశాధికారి ,కవిత శాంతమ్మ, ,లలిత రాజీవ్ గృహకల్ప కాలనీవాసులు పాల్గొన్నారు.
రాజీవ్ గృహకల్పలో ఐద్వా సర్వే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES