అసహనం వ్యక్తం చేసిన ప్రయాణికులు
నవతెలంగాణ – మల్హర్ రావు
రాఖీ పండగ సందర్భంగా స్పెషల్ బస్సుల పేరుతో ఆర్టీసీ ప్రయాణికులను దోపిడీకి గురి చేసింది. ఆదాయం రాబట్టుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టిన అధికారులు ఏ అవకా శాన్నీ వదులుకోవడం లేదు. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అనుబంధాన్ని చాటే రాఖీ పౌర్ణమికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి, 30 శాతం అదనపు ఛార్జీలు వసూలు చేసింది. రాఖి పౌర్ణమి పురస్కరించుకుని శని,ఆది వారాల్లో వేల మంది మహిళలు తమ సోదరులకు రాఖీ కట్టడానికి ఊళ్లకు వెళ్లడం కోసం ఆర్టీసీ బస్సులను ఆశ్రయించారు.
ఇదే సందర్భంగా పలు వురు సోదరులు కూడా తమ అక్కా, చెల్లెళ్లతో రాఖీ కట్టించుకోవడానికి వారి ఊరికి వెళ్లారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఆర్టీసీ అధికారులు స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసి అన్ని రూట్లలో టికెట్పై 30 శాతం అదనంగా ఛార్జీలు వసూలు చేశారు.’రాఖీ స్పెషల్’ పోస్టర్ అతి కించి అదనంగా వసూలు చేస్తుండటంపై ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. పండగల సమయంలో అదనపు బస్సులు సమ కూర్చుకొని ఆదాయం పెంచుకోవాలి కానీ.. ఇలా ఎక్కువ ఛార్జీలు వసూలు చేయడం సరి కాదంటున్నారు.
రాఖీ స్పెషల్..బస్సులు…30 శాతం చార్జీలు అదనం.!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES