Thursday, March 26, 2026
E-PAPER
Homeసినిమారామ్‌చరణ్‌ క్షేమం

రామ్‌చరణ్‌ క్షేమం

- Advertisement -

‘పెద్ది’ సినిమా సెట్‌లో జరిగిన చిన్న ఘటన గురించి వచ్చిన వార్తలపై స్పష్టత ఇవ్వాలనుకుంటున్నాం. రామ్‌ చరణ్‌ క్షేమంగా ఉన్నారు. షూటింగ్‌ సమయంలో ఎడమ కంటికి చిన్న గాయం కావడంతో ఒక చిన్న ప్రొసీజర్‌ చేశారు. ఆయన నేటి (గురువారం) నుంచి తిరిగి షూటింగ్‌లో పాల్గొంటారు. షూటింగ్‌ షెడ్యూల్‌కు ఎలాంటి అంతరాయం లేదు. అభిమానులు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అన్నీ కంట్రోల్‌ ఉన్నాయి. సినిమా పనులు సజావుగా కొనసాగుతున్నాయి’ అని చిత్ర బృందం తెలిపింది. రామ్‌ చరణ్‌ నటిస్తున్న పాన్‌-ఇండియా యాక్షన్‌ డ్రామా ‘పెద్ది’. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో వద్ధి సినిమాస్‌ బ్యానర్‌పై వెంకట సతీష్‌ కిలారు నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్‌ 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమవుతోంది.

తాజాగా మేకర్స్‌ మరో బిగ్‌ అప్డేట్‌ ఇచ్చారు. ‘పెద్ది’ గేమ్‌ గ్లింప్స్‌ ఈనెల 27 ఉదయం 11 గంటల 7 నిమిషాలకు రిలీజ్‌ కానుంది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. శివ రాజ్‌కుమార్‌, జగపతి బాబు, దివ్యేందు, బోమన్‌ ఇరానీ ఇతర ప్రముఖ పాత్రలను పోషిస్తున్నారు. ఈ చిత్రానికి రచన, దర్శకత్వం: బుచ్చిబాబు సానా, సమర్పకులు: మైత్రి మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌, నిర్మాత: వెంకట సతీష్‌ కిలారు, సహ నిర్మాత: ఇషాన్‌ సక్సేనా, సంగీతం: ఏఆర్‌ రెహమాన్‌, డీఓపీ : ఆర్‌ రత్నవేలు, ప్రొడక్షన్‌ డిజైన్‌: అవినాష్‌ కొల్లా, ఎడిటర్‌: నవీన్‌ నూలి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: వి.వై.ప్రవీణ్‌ కుమార్‌.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -