Wednesday, October 22, 2025
E-PAPER
Homeజాతీయంఆపరేషన్‌ సిందూర్‌కు రాముడే స్ఫూర్తి

ఆపరేషన్‌ సిందూర్‌కు రాముడే స్ఫూర్తి

- Advertisement -

ధర్మాన్ని కాపాడుతూ ప్రతీకారం తీర్చుకున్నాం : మోడీ
న్యూఢిల్లీ : ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో భారతదేశం ధర్మాన్ని కాపాడ డంతో పాటు అన్యాయానికి ప్రతీకారం తీర్చుకున్నదని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. దీపావళి పండుగ సందర్భంగా ఆయన మంగళవారం దేశ ప్రజలకు ఓ లేఖ రాశారు. అయోధ్యలో రామాలయ నిర్మాణం తర్వాత ఇది రెండో దీపావళి అని గుర్తు చేస్తూ ధర్మాన్ని ఎలా నిలబెట్టాలో శ్రీరాముడు నేర్పాడని, అలాగే అన్యాయాన్ని ఎదుర్కోవడానికి తగిన ధైర్యాన్ని కూడా ఇచ్చాడని వివరించారు. ఆపరేషన్‌ సిందూర్‌కు రాముడే ఉదాహరణ అని అన్నారు. నక్సలిజం, మావోయిజం మూలాలను నిర్మూలించిన ప్రాంతాలలో ఈ ఏడాది ప్రజలు దీపావళిని జరుపుకున్నారని తెలియజేశారు. ఇటీవలి కాలంలో దేశంలో చాలా మంది హింసామార్గాన్ని విడనాడి ప్రధాన అభివృద్ధి స్రవంతిలో చేరారని చెప్పారు. సమీప భవిష్యత్తులో ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతున్నామని తెలిపారు. జీఎస్టీ రేట్ల కుదింపు వంటి తదుపరి తరం సంస్కరణలు కూడా దేశంలో ప్రారంభమయ్యాయని ప్రధాని తన లేఖలో వివరించారు. దేశీయ ఉత్పత్తులకు పెద్ద పీట వేయాలని, వాటిని కొనుగోలు చేసి ప్రోత్సహించాలని ప్రజలను ప్రధాని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -