Tuesday, March 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ముస్లీంలకు రంజాన్ తోఫాలు అందజేత

ముస్లీంలకు రంజాన్ తోఫాలు అందజేత

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలో మంగళవారం స్థానిక సర్పంచ్ ఉషా సంతోష్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధరాస్ సాయిలు, మైనారిటీ మండల నాయకులు జావిద్ పటేల్ కలిసి నిరుపేద ముస్లింలకు రంజాన్ తోఫాను అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానిక సర్పంచ్ మాట్లాడుతూ.. ముస్లింలకు ప్రజా పాలన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని అన్నారు. ఈ క్రమంలో నేడు ముస్లీం సోదరులకు రంజాన్ తోఫా అందించామని తెలిపారు. అనంతరం ముస్లీం సోదరులు నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. రంజాన్ తోఫాలను అందుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -