- Advertisement -
హైదరాబాద్: తెలంగాణ వాలీబాల్ అధ్యక్షుడిగా గజ్జెల రమేష్‌బాబు ఎన్నికయ్యారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో జరిగిన ఎన్నికల్లో రమేష్‌తో పాటు ప్రధాన కార్యదర్శిగా నల్లా హనుమంత రెడ్డి, ఉపాధ్యక్షులుగా నిమ్మగడ్డ వెంకటేశ్వరావు, జి.ప్రకాష్, వి.మల్లారెడ్డి, కోశాధికారిగా కె.కృష్ణప్రసాద్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీరితో మరో ముగ్గురు జాయింట్ సెక్రటరీలు, ఐదుగురు ఈసీ సభ్యులకు కార్యవర్గంలో చోటు లభించింది. 2029 వరకు కొత్త కమిటీ పదవిలో కొనసాగుతుంది. ఈ ఎన్నికలకు క్రీడా ప్రాధికార సంస్థ (శాట్జ్) నుంచి డీడీ చంద్రారెడ్డి, జాతీయ వాలీబాల్ సమాఖ్య నుంచి లలితాదేవి, తెలంగాణ ఒలింపిక్ సంఘం నుంచి ఎ.లింగయ్య పరిశీలకులుగా హాజరయ్యారు.
- Advertisement -