- Advertisement -
నవతెలంగాణ – బెజ్జంకి
మండల పరిధిలోని గుగ్గీళ్ల, తిమ్మాయిపల్లి గ్రామాలకు చెందిన విశ్వోజు లింగయ్య, జేరిపోతుల కిష్టయ్య ఇటీవల ఆనారోగ్య కారణాలతో మృతి చెందారు. శనివారం మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం విశ్వోజు నాగభూషణం, దానవేణి మల్లయ్య ఆనారోగ్యంతో బాదపడుతుండడంతో బాధితులను రసమయి సందర్శించి ఆరోగ్య వివరాలడిగి తెలుసుకున్నారు. అయన వెంట మండల బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
- Advertisement -