Magazines

అవినీతిని ప్రశ్నించినందుకే క్రిశాంక్‌ అక్రమ అరెస్టు

1 గంట క్రితం

for questioning corruption.
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 07, 2026 | 2 నిమిషాల చదవడం

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌ : ఎనుముల కుటుంబ అవినీతిని ఆధారాలతో ప్రశ్నించినందుకే బీఆర్‌ఎస్‌ ‌నేత మన్నె క్రిశాంక్‌ను అక్రమంగా అరెస్ట్ చేయించారని ఆ పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కె తారక రామారావు (కేటీఆర్‌) ‌విమర్శించారు. ఈ మేరకు మంగళశారం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లక్ష్యంగా స్పందించారు. దేశానికి ప్రధాని కావాలనుకుంటున్న రాహుల్ గాంధీ ఒక పిరికివాడిలా, నిరంకుశంగా, అప్రజాస్వామికంగా ప్రవర్తిస్తున్నారని తెలిపారు. ఢిల్లీలో రాజ్యాంగం గురించి ఉపన్యాసాలు దంచుతూ తెలంగాణలో రేవంత్ రెడ్డి ద్వారా అరాచక పాలన సాగిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బరితెగించి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని తెలిపారు. గల్లీల్లో తిరుగుతూ ‘ఓటు చోరీ’ అని అరిచే రాహుల్ తెలంగాణలోనే అతిపెద్ద ఓట్ల దొంగ, ఓటుకు నోటు సూత్రధారికే ముఖ్యమంత్రి కుర్చీ కట్టబెట్టారని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ ఎవరిపై పడితే వారిపై నిరాధార ఆరోపణలు చేయొచ్చు కానీ, ఆధారాలతో ప్రశ్నిస్తే క్రిశాంక్‌ను జైలుకు పంపుతారా?అని ప్రశ్నించారు. ఇప్పటికైనా రేవంత్‌ను అదుపులో పెట్టుకో రాహుల్ అని డిమాండ్‌ ‌చేశారు. భారత రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడం ఇకనైనా ఆపాలని కోరారు.
కానిస్టేబుల్ శంకర్‌ వైద్య ఖర్చులు 
నేనే భరిస్తా : కేటీఆర్‌ విధి నిర్వహణలో బ్రెయిన్‌ స్ట్రోక్‌కు గురై కిమ్స్‌ సికింద్రాబాద్‌లో చికిత్స పొందుతున్న మెదక్‌ టౌన్‌ కానిస్టేబుల్‌ దేవసోత్‌ శంకర్‌ కుటుంబానికి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అండగా నిలిచారు. శంకర్‌ వైద్యానికి అయ్యే ఖర్చు మొత్తం తానే భరిస్తానని ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌కు కేటీఆర్‌ తెలిపారు. ఈ విషయాన్ని శంకర్‌ కుటుంబ సభ్యులకు తెలియ జేయాలని ఆయన మంగళవారం కోరారు. శంకర్‌ పూర్తిగా కోలుకునే వరకు కుటుంబానికి అండగా ఉంటామని కేటీఆర్‌ భరోసా ఇచ్చారు. శంకర్‌ ఆరోగ్య పరిస్థితి, ఆయన కుటుంబం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల గురించి తెలుసుకున్న కేటీఆర్‌ మానవతా దృక్పథంతో స్పందించారు. శంకర్‌ కుటుంబ సభ్యులు ఇప్పటికే వైద్య ఖర్చుల కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బంధువులు, స్నేహితులు, సహచర పోలీసులు కలిసి ఇప్పటివరకు సుమారు రూ.1.5 లక్షలు సమకూర్చి ఆపరేషన్‌ చేయించారు. ప్రస్తుతం ఐసీయూలో శంకర్‌ చికిత్స పొందుతు‌న్నారు. మరోసారి భారీగా వైద్య ఖర్చులు అవసరం కావడంతో సహచర పోలీసులు ఒక్కొక్కరు తమకు తోచినంత సాయం చేస్తున్నారు. శంకర్‌ కుటుంబాన్ని పరామర్శించిన సందర్భంగా వారి దయనీయ పరిస్థితిని చూసి బీఆర్‌ఎస్‌ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. అత్యంత నిరుపేద కుటుంబానికి చెందిన శంకర్‌ విధి నిర్వహణలోనే తీవ్ర అనారోగ్యానికి గురైనా, అత్యవసర సమయంలో ఈహెచ్‌ఎస్‌ ద్వారా తక్షణ వైద్య సహాయం అందకపోవడం పట్ల కుటుంబ సభ్యులు ‌బాధపడ్డారు. కేటీఆర్‌ స్పందనపై ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల శాంతి భద్రతల కోసం రోజుకు గంటల తరబడి విధులు నిర్వహించే పోలీసులకు అత్యవసర సమయంలో కూడా వైద్య భద్రత లేకపోవడం ప్రభుత్వ వైఫల్యమని బీఆర్‌ఎస్‌ నేతలు విమర్శించారు. ఈహెచ్‌ఎస్‌ కింద చికిత్స విషయంలో ఆ‌స్పత్రులు, ప్రభుత్వం మధ్య నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్