పాటించిన వారిపై చట్ట పర చర్యలు తీసుకోవాలి : కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బతుకమ్మలో కుల వివక్ష పాటించటం చట్ట రిత్యా నేరమనీ, వివక్ష పాటించిన వారిపై చట్టపర చర్యలు తీసుకోవాలని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్‌బాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండ లంలోనీ అమ్మనబోలు గ్రామంలో పెత్తరామస బతుకమ్మ పండుగ సందర్భంగా గ్రామ సర్పంచ్ మామిడాల నర్సమ్మ వార్డు సభ్యురాలు బొజ్జ శ్రీలత బతుకమ్మ తో రాగానే మీరు మాదిగలు మాతో కలిసి బతుకమ్మ పెట్టొద్దని కుల వివక్ష పాటించిన ఘటనపై పోలీసులు సమగ్రమైన విచారణ జరిపి చట్టపరమైన చర్యలను తీసుకోవాలని కోరారు. స్వాతంత్రం వచ్చి ఎనబైఏండ్లు గడుస్తున్నా గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో సైతం కుల వివక్ష కొనసాగుతూనే ఉన్నదని పేర్కొన్నారు. ఇటీవల వినాయక నిమజ్జనం సందర్భంగా కూడా కుల దురహంకార దాడులు జరిగాయని గుర్తు చేశారు. అమ్మనబోలు గ్రామంలో బతుకమ్మ ఆడటంలో కులం ప్రస్తావన తెచ్చి దళితులు ఇక్కడ ఆడకూడదు అని బతుకమ్మలను తీసుకువెళ్ళేదాక కులం పేరుతో దూషించిన సంఘటనపై పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకోక పోవడం విచారకరమని తెలిపారు. ఎస్సీ ఎస్టీ ల భద్రత, రక్షణ కోసం ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం అమలులో ఉన్నప్పటికీ ఆ చట్టాన్ని ఉన్నత వర్గాలు నిర్వీర్యం చేయడం కోసం ఎస్సీ, ఎస్టీలను పావులుగా వాడుకుంటున్నారని పేర్కొన్నారు.







కామెంట్‌లు (0)