రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా
డాక్టర్ రజిని, ఎస్.జితేందర్
కోశాధికారిగా లింగస్వామి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
జనవిజ్ఞాన వేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా డాక్టర్ రజిని, ప్రధాన కార్యదర్శిగా ఎస్.జితేందర్, కోశాధికారిగా లింగస్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రెండు రోజులపాటు హైదరాబాద్‌లోని
సీసీఆర్‌టీలో కొనసాగిన ఆ సంఘం రాష్ట్ర ఆరో మహాసభ ఆదివారం ఘనంగా ముగిసింది. ఈ సందర్భంగా నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఆ సంఘం గౌరవాధ్యక్షులుగా డాక్టర్ దాసరి ప్రసాదరావు, డాక్టర్ సీహెచ్ మోహన్‌రావు, డాక్టర్ మెహతాబ్ ఎస్ బాంబీ ఎన్నికయ్యారు. రాష్ట్ర ఉపాధ్యక్షులుగా చెలిమెల రాజేశ్వర్, అలవాల నాగేశ్వరరావు, రావుల వరప్రసాద్, వెంకటరమణ ఎన్నికయ్యారు. మరో రెండు ఉపాధ్యక్ష పదవులను నల్లగొండ(మహిళ), భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు కేటాయించనున్నారు.
కార్యదర్శులుగా ఎన్. రవీందర్ రెడ్డి, యం. శ్రీనివాస్, తుమ్మ సత్యం, శ్రీనివాసరావు, కె.బి. ధర్మప్రకాష్ ఎన్నికయ్యారు. నల్లగొండ జిల్లాకు ఒకటి కేటాయించారు.
సబ్ కమిటీ కన్వీనర్లుగా డాక్టర్ అందె సత్యం(విద్య), ఎన్.శ్రీనివాసరావు(ఆరోగ్యం), టి.శ్రీనాథ్(శాస్ర్తప్రచారం), రాజారాజా(చెకుముఖి), డాక్టర్ మమత(సమత), శంకర్‌రావు(ఆడిట్), రెండు కోఆప్షన్(పర్యావరణం, సోషల్‌మీడియా) నియమితులయ్యారు. రాష్ట్ర కమిటీ సభ్యులుగా 18 మంది ఎన్నికయ్యారు. వారిలో రవీందర్‌బాబు, శాంతి, నాగరాజు, జెన్నీ, కురుమయ్య, మహేంద్రం, ప్రవీణ్‌కుమార్, ఎ.గంగాధర్, ఈ. చంద్రయ్య, గట్టు మహేష్, సాహితీ శ్రీనివాస్, ఎల్. వి. రెడ్డి, రమేశ్‌బాబు, సునీత, నల్లగొండ, కామారెడ్డి జిల్లాల నుంచి ముగ్గురు కోఆప్షన్ మెంబర్లను ఎన్నుకోనున్నారు. రాష్ట్ర కమిటీ సమావేశాలకు ఆహ్వానితులుగా ప్రొఫెసర్ కె.లక్ష్మారెడ్డి, ప్రొఫెసర్ బీఎన్.రెడ్డి, డాక్టర్ కోయ వెంకటేశ్వరరావు, ప్రొఫెసర్ ఎ.రామచంద్రయ్య, ప్రొఫెసర్ కట్టా సత్యప్రసాద్, పి.ఆనంద్‌కుమార్, చిలువేరు సంపత్‌కుమార్, డాక్టర్ ఎం.రమాదేవి హాజరుకానున్నారు.







కామెంట్‌లు (0)