- Advertisement -
రూపాయి విలువ దిగజారుతుండటమే..
ముంబయి : ఈ ఏడాది ఆగస్టులో 7.7 బిలియన్ డాలర్లను విక్రయించినట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. ఇటీవల అంతర్జాతీయ మార్కెట్‌లో రూపాయి విలువ తగ్గడంతో.. దాన్ని కట్టడి చేయడానికి డాలర్లను విక్రయించినట్టు ఆర్బీఐ వెల్లడించింది. ఆగస్టులో డాలర్‌తో పోలిస్తే రూపాయి 1.6 శాతం మేర క్షీణించడంతో రూపాయి పతనాన్ని కట్టడి చేయడానికి నికరంగా 7.69 బిలియన్ డాలర్లను విక్రయించినట్టు పేర్కొంది. అంతకుముందు నెలతో పోలిస్తే దాదాపు మూడింతలు ఎక్కువ కావడం ఆందోళనకరం. జులై, ఆగస్టు నెలల్లో అమెరికన్ డాలర్లను కొనుగోలు చేయలేదని ఆర్బీఐ తెలిపింది.
- Advertisement -